వాట్సాప్ ఫింగర్ ప్రింట్ లాక్


Wed,November 6, 2019 01:38 AM

wtsup
ఎప్పటి నుంచో వినిపిస్తున్న వాట్సాప్ ఫింగర్ ప్రింట్ లాక్ ఫీచర్ ఎట్టకేలకు రిలీజ్ అయింది. ఇటీవలే ఆ కంపెనీ ఈ ఫీచర్‌ను అప్‌డేట్ చేసింది. డివైజ్‌కు వాడే ఫింగర్‌ప్రింట్ లాక్‌తో దీన్ని ఉపయోగించుకోవచ్చు.


ఎలా ఎనేబుల్ చేయాలి

-మీ వాట్సాప్ వెర్షన్ 2.19.308 అయి ఉండా లి. లేకపోతే ప్లేస్టోర్‌నుంచి డౌన్‌లోడ్ చేయండి.
-అప్‌డేట్ అయిన వాట్సాప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.
-అకౌంట్ సెక్షన్‌లోకి వెళ్లి ప్రైవసీ పై క్లిక్ చేయండి.
-చివర్లోకి రండి.
-అక్కడ ఫింగర్‌ప్రింట్ లాక్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి.
-ఇప్పుడు లాక్ ఎనేబుల్ కోసం మీ ఫింగర్ ప్రింట్ అడుగుతుంది.
-డివైజ్‌కు ఉన్న ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా లాక్ ఇవ్వండి.
-ఎనేబుల్ అయ్యాక టైం అడుగుంది. ఎప్పుడు లాక్ పడాలి అనే ఆప్షన్ అది.
-వెంటనే, ఒక నిమిషం తర్వాత, ముప్పై నిమిషాల తర్వాత ఆప్షన్లు ఉంటాయి. వాటిని ఎంచుకోండి.
-అంతా అయిపోయాక యాప్‌ను క్లోజ్ చేసి ఓపెన్ చేయండి. ఫింగర్ ప్రింట్ లాక్ అడుగుతుంది.

294
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles