800 కోట్ల విలువైన ఇండ్లు వేలం


Sat,October 19, 2019 12:55 AM

lone
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు రూ.800 కోట్ల విలువైన ప్రాజెక్టులను వేలం వేయడానికి రంగం సిద్ధం చేసింది. ఇందులో హైదరాబాద్‌కు సంబంధించిన ఆస్తులూ ఉన్నాయి. అక్టోబరు 21, 30 తేదీల్లో రెండు విడతల్లో ఈ-వేలంను నిర్వహిస్తున్నట్లు బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.స్వామినాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఆన్‌లైన్ ద్వారా అమ్మకాలు గణనీయంగా పుంజుకున్నాయని పేర్కొనారు. డిజిటల్ పరిజ్ఞానం రాకతో ఆస్తుల కొనుగోలు ప్రక్రియ సులభతరమైందని అన్నారు. అందుకే, మ్యాజిక్ బ్రిక్స్‌తో అవగాహన కుదుర్చుకుని దేశవ్యాప్తంగా ఇండ్లను ఆన్‌లైన్‌లో వేలం వేస్తున్నామని తెలిపారు.

262
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles