మెదడు శుభ్రత ఇలా!


Fri,October 18, 2019 01:10 AM

అనవసరమైన జ్ఞాపకాలను మన మెదడు శుభ్రపరచుకొనే విధానాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. మనం నిద్రించే వేళ విడుదలయ్యే కొన్ని హార్మోన్ల వల్లే ఇది సంభవిస్తున్నట్టు తేలింది.
Shareera-Nirmana
కారు పార్కింగ్‌ స్థలం నుంచి పాత టెలిఫోన్‌ నంబరు వరకు చాలా విషయాలను చాలామంది అసంకల్పితంగా, ఇంకా ఒక్కోసారి నిద్ర తర్వాత మరిచిపోతుంటారు. ఇదంతా మన మెదడులో ఎలా సాధ్యమవుతుందన్నది శాస్త్రవేత్తలకు బోధపడడం లేదు. ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ హల్‌ పరిశోధకులు ఈ విషయంలో ఒక స్పష్టతను సాధించారు. వారు ఎలుకలపై జరిపిన పరిశోధనలో ‘మెదడులో విడుదలయ్యే హార్మోన్లే’ దీనికి మూలమని గుర్తించారు. గుర్తుంచుకోవడం, మరిచిపోవడం అన్నది మెదడులో రెండు దశలుగా జరుగుతున్నట్టు పై పరిశోధకులు అంటున్నారు. ఒక దఫాలో తొలగించుకోవడం, రెండో దఫాలో గుర్తుకు రాకుండా అడ్డుకోవడం. మెదడులోని పిట్యూటరీ గ్రంథి సమీపంలోని హైపోథాలమస్‌ (hypothalamus) అనే చిన్న పదేశంలో విడుదలయ్యే హార్మోన్‌ స్రావాలే ఈ శుభ్రత (cleaning) క్రియకు మూలంగా వారు గుర్తించారు. ఇందులో ‘మెలాటొనిన్‌ కాన్సెంట్రేటింగ్‌ హార్మోన్‌' (melatonin-concentrating hormone: MCH) న్యూరాన్లు ముఖ్యపాత్ర పోషిస్తున్నట్టు కూడా వారు కనుగొన్నారు.

702
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles