విలేజ్ స్టోరీతో దీపావళి!


Mon,October 14, 2019 01:42 AM

దీపావళి పండుగ వస్తున్నది. పండుగకు కావాల్సిన దీపాలు, స్వీట్లు, స్నాక్స్‌ను కొనుగోలు చేయడం మానేయండి. స్వతహాగా మీరే తయారు చేసుకోండి. నేర్పించేందుకు వర్క్‌షాప్ కూడా నిర్వహిస్తున్నారు. స్నాక్స్, స్వీట్లతో ఆరోగ్యకరమైన దీపావళి జరుపుకొనేందుకు ఈ వర్క్‌షాప్‌కు వెళ్లండి.
diwali
దీపావళి అనగానే దీపాలు, పటాకులు, స్వీట్లే గుర్తొస్తాయి. వాటిని కొనుగోలు చేసి పండుగ జరుపుతాం. ఈ ఏడాది కూడా అదే ముచ్చట అయితే ఏం బాగుంటుంది? కొంచెం కొత్తగా ప్రయత్నించండి. బెంగళూర్‌లోని విలేజ్ స్టోరీ వర్క్‌షాపులో పాల్గొనండి. అక్కడ దీపాలు, స్నాక్స్, స్వీట్ల తయరీ విధానాన్ని నేర్పిస్తున్నారు. బెంగళూరు దగ్గరలోని ఓ గ్రామంలోని పొలంలో రోజంతా వర్క్‌షాప్ జరుగుతుంది. మొదటి గంటలో గ్రామంలోని చిన్న తరహా పరిశ్రమలను సందర్శిస్తారు. 2017 నుంచి విలేజ్ స్టోరీతో సంబంధం ఉన్న రేఖాచావ్లా మూంగ్ హల్వా, కేజర్ పెడా, గుజియా స్వీట్ల తయారీపై శిక్షణ ఇస్తున్నారు. 2002లో బెంగళూరులోని టెర్రా బార్న్‌ను స్థాపించిన టెర్రకోట శిల్పకారిణి పూర్ణిమ గ్రామీణ కర్ణాటక మహిళలను తన విభాగంలో తీసుకొని టెర్రాకోటా ఆభరణాలను తయారు చేయడానికి టెర్రాబార్న్‌లో శిక్షణ ఇస్తుంది. అలాగే దీపాలు, వంటల తయారీ విధానాలనూ వివరిస్తుంది. విలేజ్‌స్టోరీ వ్యవస్థాపకురాలు అనామిక బిస్ట్. మార్కెట్లో కొనుగోలు చేయడం తప్ప దీపాలు, ఇతర వస్తువులు ఎలా తయారవుతున్నాయో చాలా తక్కువ మందికే తెలుసు. ఈ గ్రామాల్లో సందర్శించడం వల్ల చీరలు నేసే వారి నుంచి అరటి చిప్స్ తయారు చేసేవరకు తెలుస్తుంది. గ్రామస్తులతో సంభాషించే అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉందంటుంది అనామిక. ఈ పండుగ సందర్భంగా మంచి పని చేయాలనుకుంటే గ్రామీణ పిల్లలకు పాతబట్టలు, పుస్తకాలు, బొమ్మలను విరాళంగా ఇవ్వమని అనామిక కోరుతున్నది.
diwali1
diwali2

323
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles