రామాయణమే పారాయణం!


Sun,October 13, 2019 12:38 AM

ఇవాళ (ఆశ్వీయుజ పౌర్ణమి) సంస్కృత ఆదికవి భగవాన్ వాల్మీకి జయంతి. అక్టోబర్ 18న తెలుగులో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వారి వర్థంతి. వీరిరువురికీ వర్తించే విషయం రామాయణం. అందుకే, ఈ చిన్న ప్రస్తావన.
ramayanam
భారతీయ తొలి ఇతిహాస మహాకావ్యాన్ని సంస్కృతంలో వాల్మీకి సృష్టిస్తే, అద్భుత తెలుగు పద్యకావ్యంగా విశ్వనాథ వారు అందించారు. రామాయణ గాథలోని గొప్పతనం మరీ ముఖ్యంగా ఈతరం వారిలో ఎందరికి తెలుసు? అంతో ఇంతో కట్టె కొట్టె తెచ్చె అన్నట్టుగా ఇతివృత్తం మాత్రం చాలామందికి తెలిసినా, దానిలోని ఆయా పాత్రల ఔచిత్య పరమార్థం తెలిసిన వాళ్లు తక్కువే. పై ఇరువురు మహానుభావుల ప్రత్యేక దినోత్సవాల సందర్భంలోనైనా రామాయణ విశిష్ఠతను అందరం విధిగా తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. మూల రచన (వాల్మీకి) సంస్కృతంలో మహోన్నతంగా ఉంటే, తెలుగులో అత్యంత విలక్షణమైన పంథాలో విశ్వనాథ వారు అందించారు. కల్పవృక్షం అని పేరు పెట్టారంటేనే దాని ధర్మసమున్నతను అర్థం చేసుకోవచ్చు. చదువుకోగలిగిన వారికి చదువుకొన్నంత.


జీవితానికి కావలసినంత ధర్మచింతన లభిస్తుంది. అప్పుడు రామాయణం ఓ ఎడతెగని గాథగా చులకన చేసే వారికి దీటైన సమాధానం చెప్పగలం కూడా. వాల్మీకి మహర్షిలోని ఆత్మీయ కోణాన్నేకాదు, అంతకు మించిన తెలుగుతనాన్ని విశ్వనాథ వారు ఆవిష్కరించారు. ఒక భర్త భార్య (దశరథుడు) కిచ్చిన మాటకు ఎలా కట్టుబడాలి? అన్నతమ్ముల మధ్య ఉండాల్సిన అనుబంధం, భార్యాభర్తల నడుమ పవిత్రప్రేమ వంటివే కాదు, ఏకపత్నీ వ్రతం, పతివ్రతా స్త్రీ (సీతమ్మ) సుగుణశీలత, స్నేహనీతి, రాజధర్మం వంటివన్నీ రామాయణ గాథ నిండా ప్రతి పాత్రలోను, సన్నివేశంలోనూ సాక్షాత్కరిస్తాయి. అందుకే, ఇది కోట్లాది మందికి నిత్యపారాయణ గ్రంథమైంది.

216
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles