గ్లోబల్ చాలెంజ్


Sun,October 13, 2019 12:37 AM

ఈ నెల దుబాయ్‌లో జరుగుతున్న ఫస్ట్ గ్లోబల్ చాలెంజ్‌కు భారత్ తరపున ఒక టీం సిద్ధంగా ఉంది. అది కూడా 18 యేండ్ల అమ్మాయిలు. వారు సముద్రం ఎలా కలుషితమవుతుందో, సముద్ర జీవుల మనుగడేంటో చెప్పేస్తున్నారు.
robotc
ముంబైకు చెందిన రాధికా సేఖ్‌సరియా, ఆరూషి షా, ఆయూషి నెయినాన్, జస్మిహర్ కొచ్చర్, లావణ్య అయ్యర్. ఈ ఐదుగురు అమ్మాయిలు కలిసి టీంగా మారారు. వీరు సముద్రాన్ని కాపాడేందుకు రోబో తయారీకి సై అంటున్నారు. ప్లాస్టిక్, మరేఇతర కారణాలు ఏవైనా సముద్రంలో అంతరించిపోతున్న జీవులను సంరక్షించడానికి ఒక పోటీ రానుంది. అమెరికాకు చెందిన ఓ ఎన్జీవో ఆధ్వర్యంలో ఈ పోటీ జరుగనున్నది. దీని పేరు ఫస్ట్ గ్లోబల్ చాలెంజ్. ఈ పోటీలో ప్రపంచం నలుమూలల నుంచి 193 దేశాలకు చెందిన 2000 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. రోబో డిజైన్, కన్‌స్ట్రక్షన్ అండ్ ఎలక్ట్రికల్స్ విభాగాన్ని ఆరూషి షా చూసుకుంటున్నది. ఫండ్ రైజింగ్ అండ్ ప్రోగ్రామింగ్‌ను రాధికా సేఖ్‌సరియా పర్యవేక్షిస్తున్నది. అవుట్ రీచ్ అండ్ ప్రోగ్రామింగ్‌పై ఆయూషి నెయినాన్ పని చేస్తుంటే, ప్రోగ్రామిండ్ అండ్ స్ట్రాటజీని జస్మిహర్ కొచ్చర్, రోబో కన్‌స్ట్రక్షన్ అండ్ స్ట్రాటజీని లావణ్య అయ్యర్ పరిశీలిస్తున్నది. విద్యార్థులంతా సముద్రం కలుషితమవడానికి కారణాలు, సముద్రజీవుల మనుగడ, భూగోళం ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారాలను తమ ప్రాజెక్టుల ద్వారా వివరించాలి. 20 బృందాలతో పోటీపడి, 4 టెక్నికల్ రౌండ్లను ఎదుర్కొని ఈ టీమ్ పోటీకి ఎంపికయింది. వీరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రోబోటిక్స్‌పై అవగాహన పెంచుతున్నారు.
robotc1

161
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles