అర్థం పరమార్థం


Sun,October 13, 2019 12:37 AM

Ila-cheddam
మరల నిదేల రామాయణం బన్నచో
నీ ప్రపంచకమెల్ల నెల్లవేళ
తినుచున్న అన్నమే తినుచున్న దిన్నాళ్లు
తన రుచి బ్రదుకులు తనివిగాన
చేసిన సంసారమే చేయుచున్నది
తనదైన అనుభూతి తనదిగాన
తలచిన రామునే తలచెద నేనును
నా భక్తి రచనలు నావిగాన
కవి ప్రతిభలోన నుండును గావ్యగత శ
తాంశముల యందు తొంబదియైన పాళ్లు
ప్రాగ్విపశ్చిన్మతంబున రసము వేయి
రెట్లు గొప్పది నవకథా దృతిని మించి.
- విశ్వనాథ సత్యనారాయణ (రామాయణ కల్పవృక్షం)


రామాయణాన్ని ఎందరో రాశారు. తిరిగి అదే రాయాలా? అన్న ప్రశ్న వచ్చినప్పుడు విశ్వనాథ సత్యనారాయణ వారు చెప్పిన పద్యసమాధానమిది. మనం తిన్న అన్నమే మళ్లీ మళ్లీ తింటుంటాం. తల్లిదండ్రులు చేసిన సంసారాన్నే పిల్లలతోనూ చేయిస్తారు. ఎందుకు? అంటే, ఇదొక కాలచక్రం. సృష్టి నైజం. ఎవరి అనుభూతులు, ఆలోచనలు వారివి. కొత్త దృక్పథాలు, సృజనాత్మక భావనలు అలానే వెలువడతాయి. పాతదే అయినా కొత్తగా చెప్పాలి. అప్పుడే పరమార్థాలు బోధపడతాయి. అలా రాసినందుకే వారి రామాయణ కల్పవృక్షానికి భారతీయ అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞానపీఠ్ లభించింది!

150
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles