పిల్లలు పక్క తడుపుతున్నారా?


Sun,October 13, 2019 12:36 AM

పిల్లలు పక్క తడిపే అలవాటుని మెడికల్ టర్మినాలజీలో నాక్టర్నల్ ఎన్యురెసిస్ అంటారు. ఈ సమస్య పిల్లలకు ఓ వయసు వచ్చే వరకూ ఉంటుంది. అయితే కొందరు పిల్లలు 6, 7 సంవత్సరాలు వచ్చాక కూడా ఈ అలవాటు మానుకోరు. ఇదే కొనసాగితే ఆందోళన తప్పదంటున్నారు నిపుణులు.
sleeping-boy
-పడుకునే గది ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం. పాలు, నీళ్లు లాంటి ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, పడుకునే ముందు ఏదైనా తాగడం వంటి వాటివల్ల ఈ సమస్య తలెత్తవచ్చు.
-బిడ్డ మూత్రాశయం తక్కువగా అభివృద్ధి చెందడం లేదా ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలోనే ఉందా అనేది నిర్ధారించుకోవాలి. ఈ సమస్యలు ఉంటే పిల్లలు మూత్రాన్ని నియంత్రించలేరు. బిడ్డ ఆహారంలో అధికంగా కెఫిన్, డైయూరిటక్స్ వంటివి ఎక్కువగా ఉన్నా మూత్రం ఉత్పత్తి పెరుగుతుంది. ఒక్కోసారి బద్దకం కూడా కారణం కావొచ్చు.
-పిల్లలు రాత్రిపూట ఎక్కువసార్లు పక్క తడిపితే మధుమేహం, యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్, మానసిక ఒత్తిడి, జన్యుపరమైన సమస్యలుగా గుర్తించాలి. ఇలాంటి వారిని పిల్లల వైద్యుడికి చూపించాలి. పిల్లలకు వాల్‌నట్స్, కిస్మిస్ తినడం అలవాటు చేస్తే సమస్య కొంతవరకు తగ్గుతుంది.
-పిల్లలకు పూటకో అరటిపండు తినిపించాలి. ఇది జీర్ణవ్యవస్థకు తోడ్పడుతూ, మూత్రాశయంలో అదనపు ద్రవాన్ని నిరోధించడానికి సహాయపడుతుంది. రాత్రిపూట తింటే దగ్గు వచ్చే అవకాశం ఉంటుంది. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అరటిపండు తినిపించడం మంచిది.
-దాల్చిన చెక్కను పొడిచేసి దాన్ని కొద్దిగా తీసుకొని అందులో కొద్దిగా తేనె కలిపి ఇస్తే పక్క తడిపే అలవాటుని నివారించవచ్చు. రాత్రి వేళల్లో పిల్లలు స్వీట్లు, చాక్లెట్లు వంటివి తినకుండా చూడాలి.

188
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles