రక్తకణాలు పెంచుకోండిలా..


Sun,October 13, 2019 12:35 AM

డెంగ్యూ ఫీవర్ వచ్చిందంటే ప్లేట్‌లెట్స్ సంఖ్య పడిపోతుంది. చాలామంది ప్లేట్‌లెట్స్‌ను పెంచుకోవడానికి టానిక్‌లు, ట్యాబెట్లు వాడుతుంటారు. ప్లేట్‌లెట్ల సంఖ్యను సహజ పద్ధతిలో పెంచుకోవాలంటే ఈ ఫుడ్ తీసుకుంటే మంచిది.
platelates-food
-బొప్పాయి ఆరోగ్యానికి మంచిది. పండిన బొప్పాయి ముక్కలు రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే రక్త హీనత సమస్య ఉండదు. బొప్పాయి ఆకులు ప్లేట్‌లెట్ల సంఖ్య పెరగడానికి ఉపయోగపడుతాయి. ఈ ఆకుల్ని నీటిలో వేసి మరగబెట్టి ఆ నీటిని చల్లారాక తాగాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే ప్లేట్‌లెట్ల సంఖ్య త్వరగా పెరుగుతుంది.
-ఒక కప్పు గోధుమ గడ్డి జ్యూస్‌లో 3 చుక్కల నిమ్మరసం కలిపి తాగినా మంచి ఫలితం వస్తుంది. దానిమ్మలో ఐరన్ అధికంగా ఉంటుంది. రోజూ తీసుకుంటే రక్తకణాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దీంతోపాటు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
-విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మ, నారింజ, బచ్చలి కూర తింటే రక్తకణాల సంఖ్య వృద్ధి చెందుతుంది. ప్లేట్‌లెట్ల సంఖ్య పెంచడంలో ఉసిరి పాత్ర ఎంతో ఉంది. రోజూ ఉదయాన్నే ఉసిరి జ్యూస్‌లో తేనె కలిపి తాగితే మంచిది.
-రక్తహీనత ఉన్నవారికి బీట్ రూట్ అద్భుతంగా పనిచేస్తుంది. వారానికోసారి బీట్‌రూట్ జ్యూస్ తాగితే బ్లడ్‌లోని ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరుగుతుంది. నువ్వుల నూనెతో తయారు చేసిన వంటద్వారా కూడా రక్తకణాల సంఖ్యను పెంచుకోవచ్చు.

220
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles