ప్రదర్శనకు 300 ప్రాపర్టీలు..


Sat,October 12, 2019 01:13 AM

Chalapathi

- ట్రెడా అధ్యక్షుడు ఆర్‌.చలపతిరావు

హైదరాబాద్‌ నగరానికి అన్ని వైపులా అభివృద్ధి చెందే దిశగా రియల్‌ ఎస్టేట్‌ రంగం ముందుకు సాగుతున్నదని ట్రెడా అధ్యక్షుడు చలపతిరావు స్పష్టం చేశారు. అక్టోబరు 18 నుంచి 20 దాకా ‘ట్రెడా’ 10వ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన ‘సంపద’తో మాట్లాడారు. ఇప్పటివరకు నగరానికి ఒకవైపే అభివృద్ధి చెందడానికి అప్పటి పరిస్థితులే కారణమన్నారు. గతంలో ఆయా ప్రాంతాల్లో సులువుగా స్థలం లభ్యం కావడం, ఐటీ కంపెనీల స్థాపన వంటి కారణాలతో ఒకవైపే అభివృద్ధి కేంద్రీకృతమైందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయని, నగరానికి అన్ని వైపులా రియల్‌ ఎస్టేట్‌ రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

‘సొంతింటి కలను సాకారం చేసుకోవాలని ఎదురు చూసేవారికి ప్రాపర్టీ షో ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో దాదాపు వందకు పైగా బిల్డర్లు, డెవలపర్లు, నిర్మాణ సామగ్రి సరఫరాదారులు పాల్గొంటారు. 300కు పైగా ప్రాపర్టీలను డెవలపర్లు, బిల్డర్లు ప్రదర్శిస్తారు. ప్రస్తుతం అంతర్జాతీయ సంస్థలకు హైదరాబాద్‌ కేంద్రంగా మారింది. అనేక బహుళజాతి సంస్థలు నగరానికి వస్తున్నాయి. అమెరికా తర్వాత హైదరాబాద్‌లోనే ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నాయి. హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టడం తక్కువ రిస్క్‌తో కూడుకున్నది. అంతేకాక ప్రజలు రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడం చాలా సురక్షితం కూడా. దేశవ్యాప్తంగా రియల్‌ రంగం మందగమనంలో ఉంటే, హైదరాబాద్‌లో మాత్రం ముందంజలో ఉంది. ప్రభుత్వం సహకారం, ప్రయాణ సౌకర్యం, అఫర్డబుల్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు, మెట్రోపాలిటన్‌ కల్చర్‌, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ వంటి కారణాలతో అనేక అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌ నగరం వైపు చూస్తున్నాయి.

l అమెజాన్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌, యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి కంపెనీలన్నీ హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేయడం కలిసొచ్చే అంశం. హైదరాబాద్‌లో మౌలిక సౌకర్యాలు కూడా రెండింతలు పెరిగాయి. ఒకప్పుడు నగరంలో ఎక్కువగా ఐటీ అభివృద్ధి చెందింది. కానీ ఇప్పుడో, సెల్‌ఫోన్‌ మానుఫ్యాక్చరింగ్‌, వేర్‌హౌసింగ్‌ వంటివి హైదరాబాద్‌లో వృద్ధి చెందుతున్నాయి. హైదరాబాద్‌లో ఫార్మా విభాగం ఏటా మంచి ఎగుమతులను సాధిస్తున్నది. అందుకే, ప్రస్తుతం ఇక్కడ రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడానికి సరైన సమయమిదే. 2015 తర్వాత ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక పాలసీలు పరిశ్రమాభివృద్ధికి దోహదపడ్డాయి. నగరానికి దక్షిణంతోపాటు తూర్పు, ఉత్తరం వైపు కూడా షాపింగ్‌ మాళ్లు, కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. పలు ఐటీ కంపెనీలు ఉప్పల్‌ వైపు దృష్టి సారిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ‘లుక్‌ ఈస్ట్‌' పేరుతో నగరానికి తూర్పున అభివృద్ధికి బాటలు వేస్తుంది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 5 వేలకు పైగా యూనిట్లు అమ్ముడుపోయాయి. 6 కోట్ల చదరపు అడుగుల రెసిడెన్షియల్‌ ప్రాంతం అభివృద్ధి అయింది. ప్రతి ఏడాది 30 వేల యూనిట్లకు పైగా ప్రారంభమవుతున్నాయి. రెసిడెన్షియల్‌ స్పేస్‌లో మంచి అభివృద్ధిని ప్రత్యక్షంగా చూస్తున్నాం. 2025 నాటికి 25 కోట్ల నుంచి 30 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్‌లో వాణిజ్య సముదాయాలు దేశం మొత్తం మీద కంటే ఎక్కువగా పెరుగుతాయ’ని చెప్పారు.

323
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles