సంతాన సాఫల్యానికి ఏ పరీక్షలు అవసరం?


Mon,October 7, 2019 12:06 AM

నా వయసు 36 ఏళ్ళు. పెండ్లయి పదకొండు సంవత్సరాలయినప్పటికీ ఇంతవరకూ సంతానం లేదు. సంతాన సాఫల్య విధానం ద్వారా సంతానాన్ని పొందే అవకాశాలు ఉన్నాయా అని తెలుసుకునేందుకు హైదరాబాదులోని ఓ సంతాన సాఫల్యకేంద్రానికి వెళ్లాం. ఇందుకుగాను చాలా పరీక్షలు చేయాల్సి ఉంటుందని, అన్ని ఏర్పాట్లు చేసుకొని రండని చెప్పారు. మా ఇద్దరిలో లోపమేమిటో తెలుసుకోవడానికి ఇద్దరినీ పరీక్షించాలా? సంతానసాఫల్య చికిత్స పొందేందుకు సాధారణంగా దంపతులిద్దరికీ ఎటువంటి పరీక్షలు అవసరమవుతాయి? దయచేసి వివరంగా తెలియజేయగలరు.
- పి. మంజులా దేవి, మునగాల

counsiling
సహజపద్ధతిన సంతానం పొందలేకపోవడానికి దంపతుల్లో ఒక్కరిలోనో, ఇద్దరిలోనో కొన్ని అడ్డంకులు కారణం అవుతుంటాయి. అటువంటి ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కొంటున్న దంపతులకు సంతాన సాఫల్య పరిష్కారాలు చూపించడానికి ముందుగా అవసరమైన పరీక్షలు చేయించవలసి ఉంటుంది. సంతాన సాఫల్య చికిత్సకు ముందు దానికి దారితీస్తున్న కారణాలను కచ్చితమైన రీతిలో శాస్త్రీయంగా నిర్ధారించుకోవడం అవసరం. వీటిని గుర్తించేందుకుగాను దంపతులు ఇద్దరికీ విడివిడిగా పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. స్త్రీలలో వంధ్యత్వానికి దారితీసిన పరిస్థితులు ఏమిటో గుర్తించి, నిర్ధారించడానికి ప్రాథమిక పరీక్షగా ఓవులేషన్ మానిటరింగ్ చేస్తారు. ఇందుకుగాను గర్భాశయానికి అల్ట్రాసౌండ్ టేస్ట్, ట్యూబ్యులార్ ప్రెగ్నెన్సీ టెస్ట్, హార్మోన్ టెస్ట్ చేస్తారు. ఈ పరీక్షల ఫలితాలపైన ఆధారపడి చికిత్సను నిర్ణయించేందుకు ముందు మరికొన్ని పరీక్షలు జరపాల్సి రావచ్చు. అవి: ఎఫ్.ఎస్.హెచ్, ఈ2, ఎల్.హెచ్. -హెచ్.సి.వి యాంటీబాడీస్ -కంప్లీట్ హిమోగ్రామ్ - హెచ్.ఐ.వి.-1, 2 యాంటీబాడీస్ -టి.ఎస్.హెచ్. -హెచ్.పి.ఎల్.సి. -ఎ.ఎం.హెచ్. -రుబెల్లా 1జిజి -ఎఫ్.టి.3, ఎఫ్.టి.4 -బ్లడ్ షుగర్ మానిటరింగ్ -ప్రొలాక్టిన్ -హెచ్.బి.ఎస్. ఆంటీజన్. -ఆంటీ హెచ్.బి.సి. అదే సమయంలో దంపతులలోని పురుషుడిలో వంధ్యత్వ పరిస్థితిని అంచనా వేసేందుకు ముందుగా సెమిన్ ఎనాలిసిస్ చేయించుకోవలసిందిగా సిఫార్సు చేస్తారు.


ఈ పరీక్ష ఆ వ్యక్తి ఫలదీకరణ స్థాయిని నిర్ధారిస్తుంది. సెమిన్ ఎనాలసిస్ పరీక్ష ద్వారా పురుష బీజకణాలు తక్కువగా ఉండడం, వాటి రూపంలో లోపం, వాటి కదలిక శక్తి సరిపడినంతగా లేకపోవడం వంటి అసాధారణ పరిస్థితులు ఏమైనా బయటపడితే డాక్టర్ మరికొన్ని పరీక్షలకు సిఫార్సు చేయవచ్చు. అవి: -అడ్వాన్సుడ్ స్పెర్మ్ ఎనాలిసిస్ -కంప్లీట్ హిమోగ్రామ్ -టెస్టిక్యులార్ బయాప్సీ -హెచ్.బి.ఎస్. యాంటీజన్ -స్క్రోటల్ అల్ట్రాసౌండ్ -హెచ్.సి.వి. యాంటీ బాడీస్ -జెనటిక్ టెస్ట్ -హెచ్.ఐ.వి.-1,2 యాంటీ బాడీస్ -కర్యోటైప్ ఎగ్జామినేషన్ -వి.డి.ఆర్.ఎల్. ప్రాథమిక పరీక్షల తరువాత దంపతులకు అవసరమైన ఈ అదనపు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆ ఫలితాల ఆధారంగా వారు సంతానాన్ని పొందలేక పోవడానికి గల కారణాలనే కాకుండా వారు తల్లిదండ్రులవటానికి గరిష్ఠంగా తోడ్పడగల చికిత్సా విధానాలను కూడా గుర్తించగలుగుతారు. అందువల్ల సంకోచించకుండా ఆధునిక వైద్య వసతులు, నిపుణులు ఉన్న వైద్యకేంద్రానికి వెళ్లి సూచించిన పరీక్షలు చేయించుకొని చికిత్స పొందండి.

డాక్టర్ ,ధాత్రీ కుమారి
సీనియర్ ఫెర్టిలిటీ & ఐ.వి.ఎఫ్ స్పెషలిస్ట్,
యశోద మదర్ & చైల్డ్ ఇనిస్టిట్యూట్,
యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్.

905
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles