మంచికోసం ఓ సెల్ఫీ


Mon,October 7, 2019 12:05 AM

పర్యావరణహితం కోసం చాలాకాలం తర్వాత ఓ చాలెంజ్ వచ్చేసింది. మంచికోసం చేసే ఈ ఉద్యమంలో పర్యావరణ ప్రేమికులతో సహా ఎంతోమంది భాగస్వాములవుతున్నారు. ఇప్పుడు మన వంతు వచ్చింది. మరి.. మీరు సిద్ధమేనా?
Rishitha-Sharma
ప్లాస్టిక్ రహిత భారతదేశం కోసం ఎన్నో యేండ్లుగా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ఆయా రాష్ర్టాలు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో అన్ని రాష్ర్టాల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. అయితే ప్లాస్టిక్ రహిత సమాజం కోసం గతేడాది అక్టోబర్ 6న ప్రారంభమైన #BYOCSelfie (బ్రింగ్ యువర్ ఓన్ కప్ సెల్ఫీ) చాలెంజ్ ఇప్పుడు ఊపందుకున్నది. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడేందుకు తమవంతుగా బైయోక్ కిట్ వెంట తీసుకెళ్లాలని బెంగళూరుకు చెందిన రిషితాశర్మ, పద్మానవీన్, సీమా శర్మ కోరుతున్నారు. వీరే బైయోక్ సెల్ఫీ చాలెంజ్‌కు నాంది పలికారు. ఆ కిట్‌తో సెల్ఫీ తీసుకొని #BYOCSelfie పేరుతో సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్టు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీని ద్వారా ఎక్కువమంది చైతన్యవంతులవుతారని రిషితా శర్మ చెబుతున్నది. ఈమె రెంట్ ఏ కట్లరీ ఆర్గనైజేషన్‌కు కోఫౌండర్‌గా వ్యవహరిస్తున్నది. ఈ సంస్థ జీరో వేస్ట్ కోసం పనిచేస్తున్నది. #BYOCSelfie చాలెంజ్‌కు ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తున్నది. ఎంతోమంది ప్లాస్టిక్ వాడకుండా స్టీల్ గ్లాస్‌లు, కప్‌లు, వాటర్ బాటిల్స్, ప్లేట్ వంటివి వెంట తీసుకెళ్తూ.. వాటిల్లో తింటున్న, తాగుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు.

353
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles