ఆదర్శ దంపతులు!


Sat,October 5, 2019 12:44 AM

పనిమనిషి అంటే ఇంట్లో పనులు చేయడానికి మాత్రమే. డబ్బులు పారేస్తే చాలు. వారికి గౌరవం ఇవ్వడం ఎందుకుఅని అహం చూపించే యజమానులు ఉన్న ఈరోజుల్లో పనిమనిషి కోసం రోడ్డు మీద పనిచేస్తున్నారు వీళ్లు.
street-couple
ముంబైకు చెందిన దీపాలి భాటియా ఆకలితో గల్లీల్లో తిరుగుతున్నది. ఎక్కడా ఆహారం దొరకలేదు. కొద్దిసేపటికి కండివాలి స్టేషన్ సమీపంలో చిన్న స్టాల్ కనిపించింది. అందులో పోహా, ఉప్మా, పరాటా, ఇడ్లీ తయారు చేసి అమ్ముతున్నారు ఇద్దరు దంపతులు. వారిని చూస్తే స్టాల్ పెట్టి అమ్ముకోవాల్సిన అవసరం లేనట్టు కనిపించారు దీపాలికి. ఇదే ప్రశ్న వారిని అడిగింది. మేము గుజరాతి కుటుంబానికి చెందిన వాళ్లం. మా ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషికి 55 ఏండ్లు. ఆమె భర్త పెరాలసిస్‌తో మంచానపడ్డాడు. వైద్యం చేయించడానికి డబ్బులేదు. పనిచేసే శక్తి ఆమెకు లేదు. అందుకే మా వంతు సాయంగా మేం స్టాల్ పెట్టి వచ్చిన డబ్బుని పనిమనిషికి ఇస్తున్నాం అని చెప్పారు. ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు స్టాల్ ఉంటుంది. తర్వాత దంపతులు ఇద్దరు ఉద్యాగాలకు వెళ్తారు. వీరు చేస్తున్న సాయం దీపాలికి ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగించింది. దంపతులు పనిమనిషికి చేస్తున్న సహాయాన్ని దీపాలి పేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ దంపతులు ఎందరికో ఆదర్శం కావాలంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన చాలామంది శభాష్ అంటూ అభినందనలు తెలుపుతున్నారు.

262
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles