గంటల తరబడి కూర్చుంటే అనారోగ్యమే!


Sat,October 5, 2019 12:42 AM

sitting-work
-అటూ ఇటూ తిరగకుండా ఒకే చోట గంటల తరబడి కూర్చునేవారికి శరీరంలోని లైపోప్రొటీన్ లైఫేజ్ (ఎల్‌పీఎల్) ఎంజైమ్ పనితీరు మందగిస్తుంది. ఈ ఎంజైమ్ చెడు కొలెస్ట్రాల్‌ను పీల్చుకొని దాన్ని కండరాల రూపంలోకి మారుస్తుంది. కదలకుండా ఒకే దగ్గర కూర్చునే వారిలో పొత్తికడుపు, ఉదరభాగాల్లో కొవ్వు పేరుకుపోతుంది.
-కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె రక్తనాళాలు మూసుకుపోతాయి. ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమ్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఎక్కువసేపు కూర్చునే వారి కండరాలు తగిన కదలికలు లేక బిగుసుకుపోతాయి.
-ప్రతి అరగంటకోసారి కుర్చీలో నుంచి లేవాలి. అటూ ఇటూ తిరుగాలి. రోజుకు కనీసం 40 నిమిషాలు నడక లేదా జాగింగ్ తప్పనిసరి. ఇది కీళ్ల సమస్య రాకుండా చేస్తుంది. ఆఫీసులో ప్రతి పని సబార్డినేటర్స్ సాయంతో చేస్తుంటారు. గంటగంటకు లేచి స్వయంగా పనులు చేసుకుంటే మంచిది.

535
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles