జుట్టు ఒత్తుగా పెరగాలంటే..


Mon,September 30, 2019 01:08 AM

జుట్టు రాలడం తగ్గినప్పుడు మాత్రమే జుట్టు పెరగడం మొదలవుతుంది. చాలామంది ఒత్తిడి సమస్యతో జుట్టును కోల్పోతుంటారు. కొంతమేర ఒత్తిడి ఉన్నప్పటికీ రోజూ
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది.

Hair
-కొంత ఆవాల నూనెను ఓ గిన్నెలోకి తీసుకోవాలి. కాస్త వేడిచేయాలి. వేడి అవగానే ఆవాల నూనెకు ముక్కలు చేసిన ఉసిరి, మెంతి విత్తనాలను కలిపి, చెంచాతో బాగాకలపాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని చల్లబరిచి, వెంట్రుకల మొదళ్లకు ఐప్లె చేసి, పూర్తి రాత్రి అలాగే ఉంచాలి. మరుసటి రోజు గాఢతలు తక్కువున్న షాంపూతో కడగాలి.
-జుట్టును కత్తిరించడం మానేస్తే వెంట్రుకల పెరుగుదల ఆగిపోతుంది. వెంట్రుకల కొనలు తెగడానికి కారణం కూడా ఇదే.
-వెంట్రుకలకు కలర్, రీ బాండింగ్ ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించాలి. ఇలాంటి రసాయనాలతో కూడిన ఉత్పత్తుల్ని వాడితే జుట్టు ఆరోగ్యాన్ని చేజేతులా పాడు చేసిన వారవుతారు. జుట్టు కండిషన్‌లో ఉంచు తూ ప్రతిరోజూ కడగాలి. జుట్టు పొడిగా మారడం వల్ల పొలుసులుగా మారి, పెరగడం ఆగిపోతుంది.
-పడుకునే ముందు జుట్టును ముడివేయాలి. జిడ్డు వెంట్రుకలు ఉన్నవారు రోజూ షాంపూ పెట్టుకుంటే మంచిది కాదు. ప్రతి 15 రోజులకు ఒకసారి హెన్న లేదా గోరింటాకుతో చేసిన హెయిర్ ప్యాక్‌ను వాడాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
-కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు నెరవకుండా ఉంటుంది. తెల్లబడిన జుట్టు నల్లగా మారడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.

3215
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles