గుండెకు రంధ్రం.. ఎలా?


Mon,September 30, 2019 01:06 AM

మా చెల్లెలికి 24 ఏళ్లు. రెండు నెలల క్రితం ప్రసవమైంది. పాప బరువు అదీ బాగానే ఉంది గానీ వారం క్రితం పరీక్షల్లో గుండెలో రంధ్రం ఉందని వైద్య పరీక్షల్లో తేలింది. హైదరాబాద్ పెద్దాసుపత్రిలో చూపిస్తే మందులిచ్చారు. కొన్నాళ్ల తర్వాత డివైజ్‌తో రంధ్రాన్ని పూడ్చాలంటున్నారు. పాప బతుకుతుందా?
- వీరేంద్ర, కామారెడ్డి

boy
చిన్నపాపకు గుండెలో రంధ్రం ఉందని తెలిస్తే ఎంత ఆందోళన ఉంటుందో అర్థం చేసుకోగలం. దురదృష్టవశాత్తు ప్రతీ వెయ్యి మంది నవజాత శిశువుల్లో 10 మంది వరకూ పుట్టుకతోనే గుండెకు సంబంధించిన లోపాలు ఉంటున్నాయి. అదృష్టవశాత్తు మీ పాపకు లోపాన్ని వెంటనే గుర్తించగలిగారు. చికిత్స అందుబాటులో ఉంది. మీరు ఎక్కువగా భయపడవద్దు. పేషెంట్ స్టేబుల్ అయిన తర్వాత గుండె గదుల మధ్య ఏర్పడే రంధ్రాన్ని డివైజ్‌తో పూడ్చే ప్రొసీజర్ నిర్వహిస్తారు. బయటినుంచి పరికరాన్ని పంపడం ద్వారా గుండె రంధ్రాన్ని పూడ్చే ప్రక్రియలో 90 శాతం వరకూ విజయావకాశాలున్నాయి. అరుదుగా ఈ ప్రొసీజర్ విఫలమైనప్పటికీ శస్త్రచికిత్స చేసి ఆ రంధ్రాన్ని పూడ్చవచ్చు.
గతంలో కేవలం సర్జరీ ద్వారా మాత్రమే సాధ్యమయ్యే ఈ చికిత్సను ఇప్పుడు ఆపరేషన్ అవసరం లేకుండా రంధ్రం దగ్గరికి పరికరాన్ని పంపి దాన్ని మూసేయడం సాధ్యమవుతున్నది. పుట్టుకతోనే గుండెలో రంధ్రాలున్న పిల్లలు కనీసం 8 నుండి 10 కిలోల బరువు పెరిగాక మాత్రమే డివైజ్‌తో రంధ్రాన్ని పూడుస్తారు.


డాక్టర్ ,పంకజ్ జరీవాలా
సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్
యశోద హాస్పిటల్స్, హైదరాబాద్

904
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles