ఉద్యోగం, చదువు ఇలా అన్ని రంగాల్లో ప్రస్తుతం ఒత్తిడి పెరిగింది. తీవ్రమైన ఒత్తిడి కారణంగా డిప్రెషన్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. ఎక్కువ రోజులు డిప్రెషన్లో ఉండిపోతే మానసికంగా, శారీరకంగా చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ చిన్న టిప్స్ పాటించడం వల్ల ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం పొందవచ్చు.

-ఒత్తిడిగా ఫీలవుతున్నప్పుడు మీ మనసుకు నచ్చే పనుల మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. మనసుకు నచ్చిన పనులు చేసేటప్పడు ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. కొంతమందికి వంట చేయడమంటే ఇష్టం. మరికొందరికి డ్యాన్స్ చేయడమంటే ఇష్టం. ఇంకొందరికి మెలోడీ సాంగ్స్ వినడం ఇష్టం.. ఇలా ఏ ప్రక్రియ ద్వారానైనా ఒత్తిడి నుంచి బయపడవచ్చు.
-మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలంటే శరీరానికి కాస్తా వ్యాయామం అవసరం. సున్నిత వ్యాయామం లేదా యోగా వంటి వాటి ద్వారా ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందవచ్చు. ఒత్తిడిలో ఉన్నప్పుడు మీ సన్నిహితులతో మాట్లాడడండి. మీ మనసులోని భావాలను వారితో పంచుకోండి.
-కాలినడక కూడా డిప్రెషన్ నుంచి రిలీఫ్‌ను ఇస్తుంది. సాయంత్రం పూట లేదా ఉదయం పూట కొంత దూరం నడవడం మానసికంగా, శారీరకంగా చాలా మంచిది. ఎక్కువగా నీళ్లు తాగాలి. శరీరం డీహైడ్రేట్ అయినా మానసిక ఒత్తిడి పెరుగుతుంది..
-ముఖ్యంగా తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యవంతమైన వ్యక్తులు కనీసం రోజుకు 6 నుంచి ఎనిమిది గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి. లేదంటే ఒత్తిడిని కలిగించే హార్మోన్లు వివిధ రసాయనాలను ఎక్కువగా విడుదల చేస్తాయి. ఒత్తిడి అధికంగా ఉందనిపిస్తే పనంతా పక్కనపెట్టేయాలి. గట్టిగా శ్వాస పీల్చుకొని వదిలేటప్పుడు శ్వాసను గమనించాలి.