ప్రేమతో ఊటీ చాక్లెట్లు..


Sat,September 28, 2019 01:10 AM

బ్లాక్ చాక్లెట్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదూ?. ఆ చాక్లెట్లన్నీ ఎన్నో రకాల కంపెనీలు తయారు చేస్తుంటాయి. కానీ ఓసారి ఊటీ చాక్లెట్లు తిని చూడండి. అక్కడ మహిళలే ఈ బ్లాక్ చాక్లెట్లను తయారు చేస్తున్నారు.
ooty-chacholates
ప్రకృతికి నెలవై పర్యాటకులను ఆకట్టుకునే ఊటిలో చూడాల్సిన ప్రాంతాలున్నట్టే తినాల్సిన చాక్లెట్లున్నాయి. అవే ఊటీ మేడ్ చాక్లెట్లు. నోరూరించే ఈ చాక్లెట్లను అక్కడి మహిళలు ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. స్థానిక కాఫీ ఉత్పత్తులతో వీటి తయారీ జరుగుతున్నది. అక్కడి బార్లలో, హోటళ్లలోని మెనూ కార్డుల్లో ఊటీ చాక్లెట్లు కచ్చితంగా కనిపిస్తాయి. ఊరించే ఈ చాక్లెట్ బైట్లను ఒక్కసారి తింటే ఎవరైనా మనసు పారేసుకోవాల్సింది. అందుకే ఊటీలో ఇవి పాపులర్ అయ్యాయి. దేశీయ పద్ధ్దతిలో ఈ చాక్లెట్లను తయారు చేస్తామని చెఫ్ ప్రతినిధి విజయ కుమార్ చెప్తున్నారు. 2011 నుంచి ఊటీ మేడ్ చాక్లెట్ల తయారీ ప్రారంభమైంది. స్థానిక మహిళలకు ఉపాధి కల్పించడానికి, సంప్రదాయ విధానాలతో చాక్లెట్లను తయారు చేయడానికి కృషి చేస్తున్నట్టు వారు చెప్తున్నారు. ఎనిమిదేండ్ల కిందట చేసిన చిన్న ప్రయత్నం ఇప్పుడు స్థానికంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంట్లోనే తయారు చేసిన వీటిని స్థానిక షాపుల్లో, హోటళ్లలో, బార్లలో అమ్ముతారు. సందర్భాన్ని బట్టి తయారీ విధానంలో మార్పులు చేస్తారు. మిల్క్, డ్రైఫ్రూట్, ఫ్రూట్, నట్, డార్క్, బాదామ్ ఇలా రకరకాల చాక్లెట్లతో వారు అందరినీ ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం రోజుకు వంద కిలలోలకు పైగా ఈ చాక్లెట్లను ఉత్పత్తి చేస్తున్నారు. అర్ధకిలోకి రూ. 5౦౦ నుంచి ఆరు వందల వరకూ ధర ఉంటుంది. ఆన్‌లైన్‌లో కూడా ఈ ఊటీ చాక్లెట్లు కొనుక్కోవచ్చు.
ooty-chacholates

187
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles