అమ్మాడి.. రుచుల గుమ్మడి!


Thu,September 19, 2019 02:35 AM

Pumkin
గుమ్మడి.. గుండెకు ఎంతో మేలు.. కంటిని.. ఒంటిని కూడా బాగు చేస్తుంది.. వీసమెత్తు కూడా కొవ్వులేని కాయగా ప్రసిద్ధి చెందింది.. అందుకే అనేక దేశాల్లో గుమ్మడికి ఆదరణ ఎక్కువ.. మనదేశంలో కేవలం సూప్, కూరగా మాత్రమే దీన్ని పరిమితం చేశారు.. అలా కాకుండా గుమ్మడితో ఎన్నో రుచులను పంచుకోవచ్చు.. తీపి.. కారాల సమ్మేళనంతో చేసిన గుమ్మడి రుచులు మీకోసం..


పంప్‌కిన్ పకోడి


Pumpkin-Pakoda

కావాల్సినవి :

గుమ్మడికాయ : 1
పచ్చిమిర్చి : 2
ఓమా : అర టీస్పూన్
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : అర టీస్పూన్
కారం : అర టీస్పూన్
శనగపిండి : ఒక కప్పు
బియ్యం పిండి : ఒక టేబుల్‌స్పూన్
చాట్‌మసాలా : పావు టీస్పూన్
ఉప్పు, నూనె : తగినంత

తయారీ :

స్టెప్ 1 : గుమ్మడికాయ చెక్కు తీసి మరీ సన్నగా కాకుండా తురిమి పెట్టుకోవాలి.
స్టెప్ 2 : ఒక గిన్నెలో ఈ తురుము వేయాలి. ఇందులో పచ్చిమిర్చి, ఓమా, అల్లం, వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
స్టెప్ 3 : దీంట్లో శనగపిండి, బియ్యం పిండి, కొద్దిగా నూనె, కొన్ని నీళ్లు పోసి పకోడి మిశ్రమంలా కలుపాలి.
స్టెప్ 4 : ఇప్పుడు కడాయిలో నూనె పోసి గుమ్మడితో కలిపి నూనెలో వేయించుకోవాలి. వీటిని గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించి తీయాలి. పై నుంచి చాట్‌మసాలా వేసుకొని తింటే ఆ టేస్టే వేరు.

గుమ్మడి పెసరపప్పు ఫ్రై

PUMPKIN-CHUTNEY

కావాల్సినవి :

గుమ్మడికాయ ముక్కలు : 1 1/2 కప్పులు, పెసరపప్పు : అర కప్పు, ఉల్లి గింజలు : ఒక టీస్పూన్, కరివేపాకు : 2 రెమ్మలు, పసుపు : చిటికెడు, ఉల్లిగడ్డ : 1, ఆలుగడ్డలు : 2, ఎండుమిర్చి : 2, ఉప్పు, నూనె : తగినంత

తయారీ :

స్టెప్ 1 : గుమ్మడికాయ ముక్కల్లో కొన్ని నీళ్లు పోసి ఉడికించాలి. ఆలుగడ్డలను ఉడికించి పొట్టు తీసి పెట్టుకోవాలి.
స్టెప్ 2 : మూడు గంటలపాటు పెసరపప్పు నానబెట్టాలి. ఈ నానిన పెసరపప్పులో నుంచి నీళ్లు పోయేలా వడకట్టాలి.
స్టెప్ 3 : ఇప్పుడు నూనె పోసి ఉల్లి గింజలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి కలుపాలి.
స్టెప్ 4 : ఇవి కాస్త వేగాక.. పెసరపప్పు, ఎండుమిర్చి, గుమ్మడికాయ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు, ఉప్పు వేసి బాగా వేయించాలి. అంతే.. వేడి వేడి ఫ్రై రెడీ!

గుమ్మడి భక్షాలు

PUMPKIN-BOBBATLU

కావాల్సినవి :

గుమ్మడికాయ
తురుము : ఒక కప్పు
నెయ్యి : 1 1/2 టేబుల్‌స్పూన్స్
రవ్వ : అర కప్పు
చక్కెర : ఒక కప్పు
యాలకుల పొడి : పావు టీస్పూన్
మైదా : ఒక కప్పు
మైదా పిండి : అర కప్పు
ఉప్పు : చిటికెడు
నూనె : 2 టేబుల్‌స్పూన్స్

తయారీ :

స్టెప్ 1 : కడాయిలో నెయ్యి వేసి రవ్వను గోల్డెన్ కలర్ వచ్చేవరకూ వేయించాలి. ఇందులో గుమ్మడికాయ తురుము వేసి ఐదు నిమిషాల పాటు కలుపాలి.
స్టెప్ 2 : ఇందులోనే యాలకుల పొడి, చక్కెర వేసి మరో నాలుగు నిమిషాలు కలుపాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. వేడి మీదే వీటిని చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి.
స్టెప్ 3 : మరో గిన్నెలో మైదా, గోధుమపిండి, ఉప్పు, కొద్దిగా నూనె, నీళ్లు పోసి చపాతీ పిండి కంటే కాస్త వదులుగా కలుపుకోవాలి. కాసేపు దీన్ని పక్కన పెట్టాలి.
స్టెప్ 4 : పిండిని చిన్న ఉండలు చేసి పాలిథిన్ షీట్‌మీద చేతులతో పూరీ సైజులో ఒత్తాలి. దీంట్లో ముందు చేసిన గుమ్మడి ఉండలను పెట్టి మూసేయాలి.
స్టెప్ 5 : చేతికి కాస్త నూనె రాసుకొని వీటిని పూరీల్లాగా చేతితోనే ఒత్తుకోవాలి. ఆ తర్వాత పెనం మీద నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.

పంప్‌కిన్ మఫిన్స్

PUMPKIN-MUFFIN

కావాల్సినవి :

గుమ్మడి తురుము : 80 గ్రా.
చక్కెర : 80 గ్రా.
బటర్ : 100 గ్రా.
మైదా : 100 గ్రా.
బేకింగ్ పౌడర్ : అర టీస్పూన్
వెనీలా ఎసెన్స్ : అర టీస్పూన్
కోడిగుడ్లు : 2
కిస్మిస్ : 10 గ్రా.
ఫ్రెష్‌క్రీమ్ : 10 గ్రా.

తయారీ :

స్టెప్ 1 : ఒక గిన్నెలో బటర్, కొద్దిగా చక్కెర, క్రీమ్ వేసి బాగా కలిపి పెట్టుకోవాలి.
స్టెప్ 2 : మరో గిన్నెలో మైదా, బేకింగ్ పౌడర్, గుమ్మడి తురుము వేసి కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత చిన్న గిన్నెలో కోడిగుడ్లను గిలక్కొట్టాలి.
స్టెప్ 3 : కోడిగుడ్ల మిశ్రమాన్ని బటర్ మిశ్రమంలో వేయాలి. ఇందులోనే వెనీలా ఎసెన్స్, కిస్మిస్, చక్కెర వేసి కలుపాలి.
స్టెప్ 4 : దీంట్లో మైదా మిశ్రమాన్ని కూడా వేసి కలిపి కాసేపు పక్కన పెట్టాలి. మఫిన్స్ కప్పులకు బటర్ రాసి పెట్టుకోవాలి.
స్టెప్ 5 : ఈ మౌల్డ్‌ల్లో గుమ్మడి మిశ్రమం వేసి 180 డిగ్రీల వద్ద పావుగంటపాటు బేక్ చేయాలి. టేస్టీ పంప్‌కిన్ మఫిన్స్ మీ నోరూరిస్తాయి.


-సంజయ్ తుమ్మ
సెలబ్రిటీ చెఫ్

583
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles