ఉపాధిగా తేనె రుచులు


Thu,September 19, 2019 02:33 AM

ఒకచోట దొరికే తేనెతో బిజినెస్ చాల్లే అనుకోలేదు. ఐదు రాష్ర్టాల నుంచి సేకరించి.. ఐదు రకాల తేనె రుచులను చూపిస్తున్నారు. ఆయా రాష్ర్టాల గిరిజనులకు ఉపాధి కల్పిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వెబ్‌సైట్లో తేనెను అమ్మకానికి పెట్టారు.
honey
ప్రతిఒక్కరిలో ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. ఒకరు వారికి తెలిసిన దానితో బిజినెస్ చేస్తే మరొకరు తెలియనిది తెలుసుకుంటూ డెవలప్ చేసుకుంటారు. ఈ విధంగానే బెంగళూరుకు చెందిన రమ్యా సుబ్రహ్మణ్యం, మిథున్ ఘట్స్ దంపతులు ఉత్తర్ కన్నడ జిల్లాలోని గిరిజనుల సంప్రదాయ ఆహారాన్ని పరిచయం చేయాలనుకున్నారు. దాని గురించి వీరికి అంతగా తెలియదు. కానీ దాని మీద రీసెర్చ్ చేశారు. గిరిజనుల దగ్గర దొరికే రకరకాల ఆహార పదార్థాలను పరిచయం చేశారు. వాటన్నింటిలో ది బెస్ట్ అనిపించింది మాత్రం హనీ అని చెప్పొచ్చు. గిరిజనులు తేనె తీసే పద్ధతి వీరిని కొత్త వ్యాపారం ప్రారంభించేలా చేసింది. అందుకే దీనిపై ఎక్కువ శ్రద్ధ చూపారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు, ఉత్తరాఖండ్ ఐదురాష్ర్టాల నుంచి తేనె సేకరిస్తున్నారు. ఒక్కోచోట తేనె ఒక్కోరుచిని కలిగి ఉంటుంది. కలుషితం కాని వాతావరణం నుంచి తేనె సేకరించి గిరిజనులు వీరికి అందచేస్తారు. ఈ ఐదురాష్ర్టాల నుంచి 550 మంది గిరిజనులు ఈ తేనె సేకరణలో భాగస్వాములైనారు. అసలైన తేనె తీపితో పాటు కొంచెం పులుపు, చేదును కలిగి ఉంటుందని రమ్యా అంటున్నది. మహారాష్ట్రలో దొరికే తేనె డయాబెటిస్ పేషెంట్లకు మంచిది అంటున్నాడు మిథున్. వీరు సేకరించిన స్వచ్ఛమైన తేనెను హనీ అండ్ స్పైస్ వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టారు. మొత్తానికి సేంద్రియ పద్ధతిలో తీసిన తేనెతో ప్రజల ఆరోగ్యం కాపాడుతున్నారు ఈ దంపతులు.
honey1

806
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles