పేపర్‌కప్పుల్లో టీ తాగుతున్నారా?


Thu,September 19, 2019 02:33 AM

t-cups
-పేపర్ ప్లేట్‌లు, కప్‌లు ఎక్కువగా వినియోగిస్తే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందట. వీటిలోనూ కొంత శాతం ప్లాస్టిక్ కలుస్తుందట. ఈ ప్లాస్టిక్ కణాలు కడుపులో చేరడం ద్వారా హార్మోన్ల అసమతుల్యత, దృష్టి లోపాలు, అలసట, చర్మ సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
-కప్పుల్లో ఉండే బ్యాక్టీరియా పొట్టలో చేరి లేనిపోని సమస్యలను తీసుకొస్తుందని వారు చెప్తున్నారు. ఇంకా కప్పులకు పూసే వాక్స్ ద్వారా వేడి వేడి చాయ్ అందులో పోయడంతో ఆ వాక్స్ కరిగి కడుపులోకి చేరుతుంది. దీనివల్ల అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది.
-కప్పులకు పూసే వాక్స్‌వల్ల చిన్న పేగుల్లో ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. జీర్ణ ప్రక్రియ వ్యవస్థను దెబ్బతీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీలైనంత వరకు స్టీల్, గాజు గ్లాసులు వాడడమే మంచిదని వైద్యులు పేర్కొంటున్నారు.
-థర్మాకోల్ కప్పులు కూడా వాడకూడదు. అవి పాలిస్టర్ అనే పదార్థంతో తయారు చేస్తారని వైద్యులు పేర్కొంటున్నారు. పాలిస్టర్ కూడా ఒక రకమైన ప్లాస్టిక్ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా ఈ రకమైన కప్పులు వాడే వారికి క్యాన్సర్ వచ్చే అవకావం ఎక్కువగా ఉంటుంది.

973
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles