ఉడుకురక్తానికి గుండెపోటా?


Wed,September 18, 2019 12:53 AM

యువత చాలావరకు ఎక్కువసేపు కూర్చొని ఉండే ఉద్యోగాలు చేస్తున్నది. అయితే ఎక్కువ సేపు కూర్చుని ఉండే యువతను వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోజుకు 9 గంటలకు పైగా కూర్చుండే ఉద్యోగం గనుక చేస్తే తప్పనిసరిగా కొన్ని అలవాట్లు చేసుకోవాలని చెప్తున్నారు.
youth
ఇటీవల నార్వేజియన్ స్పోర్ట్స్ స్కూల్‌కు చెందిన పరిశోధకులు ఓ అధ్యయనం నిర్వహించారు. ఇందులో కూర్చుని 9 గంటలు పనిచేసే వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. వీరు కనీసం రోజుకు 30 నిమిషాలు వ్యాయామం చేయాలని పేర్కొన్నారు. గుండెకు మేలు చేసే ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు. రోజుకు తొమ్మిది గంటలు పనిచేసే 36 వేల మంది యువతపై అధ్యయనం చేశారు. వీరిలో శారీరక శ్రమ చేయని వారి గుండె పనితీరు మందగించిందని పేర్కొన్నారు. ఎక్కువ సేపు కూర్చొని ఉండేవారు కచ్చితంగా ప్రతిరోజూ వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.

249
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles