ప్రేమ సందేశం


Wed,September 18, 2019 12:52 AM

ఇటీవల కాజల్ తన కుటుంబీకులతో కలిసి ఆగ్రా వెళ్లింది. తాజ్‌మహల్‌ను చూశాక యువతకు ప్రేమ గురించి ఓ సందేశం ఇవ్వాలనుకుంటున్నా అని ట్వీట్ పెట్టింది. ఆమె ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో షేర్ అవుతున్నది.
kajol-taj-mahal
ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్‌ను చూశాక నాకు ప్రేమ గురించి మీతో ఓ విషయం పంచుకోవాలని అనిపించింది. ప్రస్తుత సమాజంలో మనం ప్రేమను సీరియస్‌గా తీసుకోవడం లేదు. ప్రేమను ఆస్వాదించేందకు ఎన్నో మార్గాలున్నాయి. కానీ మనం వాటిని చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నాం. మన చుట్టూ ఉండే ఎందరో స్నేహితులు, మనం చేసే ప్రతి పనిలో అండగా నిలిచే వారిలోనూ మనం ప్రేమను చూడొచ్చు. కానీ కేవలం ఒక యువతీ, యువకుడి మధ్య మాత్రమే ప్రేమ పుడుతుందనుకుంటాం. ఇంకొందరు ప్రేమించడానికి, ప్రేమించబడడానికి అనర్హులం అని అంటుంటారు. కానీ ఎవరైతే మనకు ఆనందాన్ని పంచుతారో వాళ్ల నుంచి మనం ప్రేమను పొందుతున్నట్లే. యువత ఈ విషయాన్ని గ్రహిస్తే అమూల్యమైన ప్రేమను ఎప్పటికప్పుడు మూటగట్టుకోవచ్చు అని కాజల్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ సందేశాన్ని నెటిజన్లు షేర్ చేస్తున్నారు.

238
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles