డాక్యుమెంటరీగా ఆటో డ్రైవర్!


Sat,September 14, 2019 01:28 AM

మగవాళ్లు చేసే పనులు ఆడవాళ్లు చేస్తే వారిని అభినందించడం మానేసి హేళన చేయడం మొదలుపెడుతారు. ప్రతిభను గుర్తించి వారికంటూ పేరు సంపాదించుకుంటే అప్పుడు శభాష్ అంటూ వారి వెనుక నిలబడుతారు. ఈ అవమానాలు, పొగడ్తలన్నింటినీ ఓ మహిళా డ్రైవర్ ఎదుర్కొన్నది.
auto-driver
మణిపూర్‌కు చెందిన 40 ఏండ్ల లైబీ ఓనమ్ చొక్కా, ప్యాంటు వేసుకొని ఆటోస్టాండ్ దగ్గర ప్రయాణికుల కోసం వేచి చూస్తుంటుంది. ఒక మహిళ ఆటో నడుపడం మణిపూర్‌కి కొత్త. ఇప్పటివరకు అక్కడ మగవాళ్లు తప్ప మహిళలు ఆటో నడుపడం చూడలేదు. లైబీ మగవాళ్లలా దుస్తులు ధరించి ఆటో నడుపుతుంటే మొదట అందరూ ఆమెను హేళన చేశారు. కొత్త పేర్లతో పిలుస్తూ ఆమె పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఇబ్బందిపెట్టేవారు. వీటినేం పట్టించుకోకుండా లైబీ ఆటోనడుపుకుంటూ ఉండేది. ఆమె భర్త అనారోగ్యానికి గురవ్వడంతో పూర్తి బెడ్‌రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ సూచించాడు. ఆమెకు చదువుకునే ఇద్దరు కొడుకులు ఉండడంతో లైబీకి మరో మార్గం కనిపించలేదు. అందుకే ఆటో నడుపడం తప్పలేదు. 2011లో లైబీ ఒకరోజు ఆటోనిండా ప్యాసింజర్లను ఎక్కించుకొని పాంగీ బజార్‌లోని మార్కెట్ వద్ద వెళ్తుండగా ఫిల్మ్‌మేకర్ మీనా లాంగ్‌జామ్ కంటపడింది. ఆ వయసులో ఆటోనడుపడమేంటి? లైబీ చరిత్ర మొత్తం తెలుసుకుంది. ఆమె చిరునవ్వు వెనుక ఉన్న బాధ మీనాను కలిచివేసింది. 2015లో లైజీ జీవితాన్ని ఆటో డ్రైవర్ గా డాక్యుమెంటరీ చేసింది. దీనికిగాను మీనాను నాన్-ఫీచర్ విభాగంలో జాతీయ అవార్డు వరించింది. అప్పటి నుంచి లైబీకి కాస్త హేళనలు తగ్గాయి. మణిపూర్‌లో తొలి మహిళా ఆటోడ్రైవర్‌గా పేరు పొందింది. ప్రయాణీకులు కూడా ఆమెను గుర్తించి ఆటో ఎక్కుతుండడంతో ఆదాయం కూడా పెరిగి సొంతంగా ఆటో కొనుగోలు చేసింది. పెద్దకొడుకుని ఐఏఎస్ చదివిస్తూ, చిన్నోడిని ఛండీగడ్‌లోని ప్రిస్టీజియస్ ఫుట్‌బాల్ అకాడమీలో చేర్పించింది. లైబీని ఆదర్శంగా తీసుకొని మణిపూర్‌లో మరో ముగ్గురు మహిళలు ఆటోడ్రైవర్లుగా మారారు.

123
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles