బరువు తగ్గించుకోవచ్చు!


Sat,September 14, 2019 01:28 AM

cane-juice
-చెరుకు రసం బరువును తగ్గిస్తుంది. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది. ఇందులోని ఫ్లెవనాయిడ్స్, పాలీఫెనోలిక్ కాంపౌండ్లు, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తరచూ జ్వరం, జలుబు, తుమ్ములు వచ్చే వారికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
-రోజూ ఒక గ్లాస్ చెరుకు రసం తాగితే ఫైబర్‌తో పాటు ప్రొటీన్లు, పొటాషియం, కాల్షియం, ఐరన్, జింక్, అమైనా యాసిడ్లు శరీరానికి అందుతాయి. ఇవి అధిక బరువును తగ్గిస్తాయి. క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా ఈ డ్రింక్ తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.
-220 గ్రాముల చెరుకు రసంలో 180 కేలరీల శక్తి ఉంటుంది. పంచదార 30 గ్రాములు మాత్రమే ఉంటుంది. మన శరీరంలో పేరుకుపోయే ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసెరైడ్స్‌ను కరిగిస్తుంది. వీటి వల్లే మనం బరువు పెరుగుతూ ఉంటాం. ఇవి గుండె సంబంధిత జబ్బులకు కూడా కారణమవుతాయి. చెరుకు రసంతో వీటన్నింటినీ ఎదుర్కోవచ్చు.
-చెరుకులోని పీచు పదార్థం కొవ్వును కరిగిస్తుంది. ఇది పొట్ట చుట్టూ ఉండే బెల్లీ ఫ్యాట్‌ను నిరోధించేందుకు ఉపయోగపడుతుంది. రోజూ గ్లాస్ చెరుకు రసం తాగితే మన శరీరాన్ని అది ఆటోమేటిగ్గా క్లీన్ చేస్తుంది. అనవసర వ్యర్థాలను బయటకు పంపుతుంది. ఇలా రెగ్యులర్‌గా జరిగే ప్రక్రియతో బరువు తగ్గుతారు.
-చెరుకు రసం వల్ల ఇంకా అనేక ప్రయోజనాలున్నాయి. రోజుకో గ్లాస్ చెరుకు రసం తాగడం వల్ల కిడ్నీలు, లివర్ బాగా పనిచేస్తాయి. చాలా రోగాలు నయమవుతాయి. క్యాన్సర్, కామెర్లు వంటివి కూడా తగ్గుతాయి. చెరుకు రసంలోని పొటాషియం జీర్ణవ్యవస్థ బాగా పనిచేసేలా చేస్తుంది.

894
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles