కంటి ఇన్‌ఫెక్షనా?


Sat,September 14, 2019 01:27 AM

కంటి ఇన్‌ఫెక్షన్ అనేది కాలాలకు అతీతంగా వస్తుంది. ఇది సులువుగా ఇతరులకు వ్యాపించే అంటువ్యాధి. ఇలా ఇన్‌ఫెక్షన్ సోకిన కళ్లు ఎర్రగా మారుతాయి. కంటి నుంచి నీరు కారడం లేదా.. కంటి రక్తనాళాలు ముదురు రంగులోకి మారుతాయి.
కళ్లు దురద పెట్టడం కూడా ఇన్‌ఫెక్షన్ లక్షణమే.

eye-infection
-శుభ్రమైన గుడ్డును కలబంద గుజ్జులో ముంచి, దానితో కళ్లను తుడుచుకుంటే కంటి ఇన్‌ఫెక్షన్ పోతుంది. దోసకాయ నుంచి తయారు చేసే ఎలాంటి ఐప్యాక్ అయినా ఇన్‌ఫెక్షన్ నుంచి ఉపశమనం కల్గిస్తుంది.
-కంటి ఇన్‌ఫెక్షన్‌లను తగ్గించే మరొక ఔషధం రోజ్‌వాటర్‌లో ముంచిన కాటన్. దీన్ని కొన్ని నిమిషాల పాటు కళ్లపై ఉంచాలి. ఆ తర్వాత చల్లనినీటితో కడుక్కుంటే కంటి ఇన్‌ఫెక్షన్ పోతుంది.
-కంటి ఇన్‌ఫెక్షన్‌లను తగ్గించే మరో ఔషధం కొత్తిమీర. దీన్ని కొంచెం నీటిలో కలిపి వేడి చేసి డికాషన్‌లా తయారు చేయాలి. ఈ డికాషన్‌తో కళ్లను కడగడం వల్ల నొప్పి కంట్లో కలిగే మంటను తగ్గిస్తుంది. తాజా బంగాళదుంప రసానికి ఒక చెంచా నూనెను కలిపి ఐప్లె చేయడం వల్ల కంటి ఇన్‌ఫెక్షన్‌లను తగ్గించవచ్చు.
-ఒక చెంచా తేనె కలిపిన ఉసిరి జ్యూస్‌ను రోజులో రెండుసార్లు తాగండి. ఉసిరి కంటి ఇన్‌ఫెక్షన్‌లను నివారించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. క్యారెట్, పాలకూరల నుంచి తీసిన రసాన్ని రోజులో రెండుసార్లు తాగడం వల్ల కంటి ఇన్‌ఫెక్షన్ నుంచి త్వరిత ఉపశమనం పొందుతారు.
-విటమిన్ ఏ, ఒమేగా 3ఫ్యాటీ ఆసిడ్‌లు అధికంగా ఉన్న ఆహారపదార్థాలు ఎక్కువగా తినడం వల్ల కంటి ఇన్‌ఫెక్షన్‌లను తగ్గించుకోవచ్చు. కళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. కంటిని నలపడం చేయవద్దు. సన్‌గ్లాస్‌లు ధరించడం వల్ల కూడా ఇన్‌ఫెక్షన్‌కు గురవకుండా ఉండవచ్చు.

283
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles