రెండు అంశాలు.. రెట్టింపు ఉత్సాహం


Sat,September 14, 2019 01:22 AM

- వైష్ణవీ ఇన్‌ఫ్రాకాన్ ఎండీ పాండురంగారెడ్డి

హైదరాబాద్‌లో వాణిజ్య సముదాయాలకు గిరాకీ పెరుగుతున్నదని.. దీని వల్ల నివాస గృహాలకు మంచి డిమాండ్ పెరుగుతుందని వైష్ణవీ ఇన్‌ఫ్రాకాన్ ఎండీ పాండురంగారెడ్డి తెలిపారు. భాగ్యనగరంలో వైష్ణవి ఒనిక్స్ వన్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయ్యి.. పలు పేరెన్నిక గల సంస్థలకు అప్పగించిన సందర్భంగా ఆయన నమస్తే సంపదతో మాట్లాడారు. సుస్థిరమైన ప్రభుత్వం అధికారంలో ఉండటం, నగరాభివృద్ధిని పరుగులు పెట్టించే వ్యక్తి పురపాలక శాఖ మంత్రి కావడం వంటివి తెలంగాణకు సానుకూలాంశాలుగా అభివర్ణించారు. ఇటీవల కాలంలో ప్రపంచ పేరెన్నిక గల సంస్థ అమెజాన్ హైదరాబాద్‌లో కార్యకలాపాల్ని ప్రారంభించింది. అదే బాటలో మరిన్ని సంస్థలు అతిత్వరలో తమ ఆఫీసులను మన వద్ద ప్రారంభించనున్నాయి. ఫలితంగా, భాగ్యనగరంలో నివాస, వాణిజ్య సముదాయాలకు ఎక్కడ్లేని గిరాకీ ఉంటుందని వివరించారు. ఇంకా, ఏమన్నారో ఆయన మాటల్లోనే..
vaishnavi-onyx
హైదరాబాద్ నిర్మాణ రంగంలో దాదాపు దశాబ్దానికి పైగా కొనుగోలుదారుల అభిరుచి మేరకు అపార్టుమెంట్లు, వాణిజ్య సముదాయాల్ని నిర్మిస్తున్నాం. దాదాపు పద్నాలుగు లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ఇప్పటివరకూ అభివృద్ధి చేశాం. సుమారు 36 నిర్మాణాల్ని పూర్తి చేశాం. ఇదే అనుభవంతో ప్రస్తుతం వైష్ణవీ ఒనిక్స్ వన్ వాణిజ్య సముదాయాన్ని పూర్తి చేశాం. ఎల్‌బీ నగర్ తర్వాత విక్టోరియా స్టేషన్ వద్ద ఈ సముదాయం పూర్తయ్యింది. సాధారణ వాణిజ్య సముదాయానికి కాస్త భిన్నంగా ప్రాజెక్టులోని ప్రతిభాగం ఎలివేట్ అయ్యే విధంగా బిల్డింగ్‌ని యు ఆకారంలో నిర్మించాం. ప్రత్యేకంగా 35 ఫీట్ల సెంట్రల్ టాట్‌లాట్‌ని వదిలివేశాం. భవనం లోపల క్లియర్ స్పాన్ వుండేందుకు, తక్కువ సంఖ్యలో పిల్లర్లు వచ్చేలా నిర్మాణాన్ని పీటీ శ్లాబుల విధానంలో చేపట్టాం. ఇంత విభిన్నమైన నిర్మాణాన్ని చేపట్టడం వల్ల పేరెన్నిక సంస్థలు తమ బ్రాండ్లను ఇందులోకి అడుగుపెట్టాయి. ఇటీవల జరిగిన ఇండియన్ కాంక్రీటు ఎక్సలెన్స్ అవార్డులు 2019 కార్యక్రమంలో వెల్ బిల్ట్ కమర్షియల్ బిల్డింగ్ విభాగంలో వైష్ణవీ ఒనిక్స్‌కు అవార్డు లభించింది.
PANDURANGAREDDY

98
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles