బ్లాక్‌స్టోన్,రహేజాల రీట్..


Fri,September 13, 2019 11:20 PM

అమెరికాలో పేరుపొందిన బ్లాక్‌స్టోన్, రహేజా కార్ప్ సంస్థలు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (రీట్) ద్వారా 20 మిలియన్ చదరపు అడుగుల వాణిజ్య సముదాయాలను సంయుక్తంగా నిర్మించేందుకు సిద్ధమయ్యాయి. ఇందుకోసం ఆరు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లను నియమించే పనిలో పడ్డాయి. ఆరు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లలో మోర్గాన్ స్టాన్లీ బ్యాంకర్‌ను ఇప్పటికే నియమించగా, మిగిలిన వారిని ఎప్పుడైనా నియమించవచ్చు. రహేజా వాణిజ్యాభివృద్ధిలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, పుణె, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఎనిమిది ఐటీ పార్కులు ఉన్నాయి.
budget
ప్రతిపాదిత జాబితా కోసం సంబంధిత పత్రాలను దాఖలు చేసే ప్రక్రియను ప్రారంభించాయి. కమర్షియల్ పార్కుల నిర్మాణంలో భారతదేశంలోనే రెండో అతిపెద్ద డెవలపర్ అయిన రహేజా కార్ప్ ముంబైలోని మైండ్‌స్పేస్, కమెరోజోన్ సంస్థ బ్రాండ్ల కింద దేశంలోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో 30 మిలియన్ చదరపు అడుగుల వాణిజ్య స్థలాన్ని అభివృద్ధి చేసింది. బ్లాక్‌స్టోన్ సంస్థ భారతదేశ రియల్ ఎస్టేట్ రంగంలో అత్యంత దూకుడుగా ఉన్న సంస్థాగత పెట్టుబడిదారుగా అవతరించిన విషయం తెలిసిందే. ముంబై, నొయిడా, పుణె, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో 5.3 బిలియన్ డాలర్ట పెట్టుబడి పెట్టేందుకు బ్లాక్‌స్టోన్ సిద్ధంగా ఉన్నది. ఎంబసీ ఆఫీస్ పార్కుల రీట్‌కు సానుకూల స్పందన రావడం ద్వారా చాలా మంది రియాల్టీ డెవలపర్లకు ఆదాయాన్ని ఉత్పత్తి చేసే వాణిజ్య ఆస్తుల పోర్ట్‌ఫోలియోపై విశ్వాసం పెరిగింది.

98
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles