అంతా ఆటోమేటిక్!


Thu,September 12, 2019 04:45 AM

Vaishali-Chinnayya
చాలామంది మోటర్ ఆన్ చేసి ఇంటి పనుల్లో పడి ఆఫ్ చేయడం మర్చిపోతుంటారు. దాంతో ట్యాంక్ నిండి నీరు వృథా అవుతుంది. పైగా విద్యుత్ చార్జీలు కూడా పెరుగుతాయి. దీన్ని అరికట్టడానికే ఈ దంపతులు ఓ డివైజ్‌ను కనుగొన్నారు.


బెంగళూరుకు చెందిన చిన్నయ్య మాథ్, వైశాలీ చిన్నయ ఇద్దరు దంపతులు నీటిని ఆదా చేయాలనుకున్నారు. కానీ నీటిని ఎలా ఆదా చేయాలనేది వారికి తట్టలేదు. దీంతో చిన్నయ్య అతని స్నేహితుడిని కలిశాడు. అతడు చిన్నయ్యకి ఒక సలహా ఇచ్చాడు. దీంతో చిన్నయ, వైశాలీతో కలిపి ని-ది వాటర్ సేవియర్ అనే పేరుతో డివైజ్‌ను కనుగొన్నారు. దీన్ని ట్యాంక్‌కు కనెక్ట్ చేస్తే చాలు.. వైఫై ద్వారా ట్యాంక్ నిండగానే ఆటోమేటిక్‌గా మోటార్ స్విచ్ ఆఫ్ అవుతుంది. ఇలా చేయడం వల్ల ట్యాంక్ నిండదు. నీరు వృథా కాదు. అంతటితో ఆగకుండా 2017లో చిన్నయ్య నింబల్ విజన్ అనే డివైజ్‌ను తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయన భార్య వైశాలి దీంట్లో కూడా భాగస్వామురాలయింది. ఈ డివైజ్ ప్రత్యేకత ఏంటంటే.. ట్యాంక్‌కు కనెక్ట్ చేస్తే అందులో నీరు 15 శాతం కంటే తక్కువగా ఉంటే మోటర్ ఆన్ అవుతుంది. ట్యాంక్ నిండగానే ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. దీనిపై మరిన్ని ప్రయోగాలు చేసిన తర్వాత మార్కెట్‌లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.
Vaishali-Chinnayya1
అదే జరిగితే మరింత నీరు ఆధా అవుతుంది. చిన్నయ్య మాథ్, వైశాలీ ఈ పని చేపట్టడానికి బలమైన కారణం ఉంది. వీరికి నీటి కొరత ఎక్కువగా ఉన్నది. ఇంటి అవసరాల కోసం ట్యాంకర్ నీటిని కొనుగోలు చేస్తున్నారు. అంటే.. రోజూ 2600 లీటర్ల నుంచి 3000 లీటర్ల నీటి కోసం నెలకు రూ. మూడువేలు వెచ్చిస్తున్నారు. ఒకవైపు నీటిని కొనుగోలు చేస్తుంటే.. మరోవైపు ట్యాంక్ నిండి నీరు వృథాగా పోతుంటే చిన్నయ్యకు బాధగా అనిపించింది. ఈ సమస్యను పరిష్కరించడమే బాధ్యతగా తీసుకున్న ఈ దంపతులకు అందరూ అభినందనలు తెలుపుతున్నారు.

717
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles