వెక్కిళ్లు ఆగట్లేదా?


Thu,September 12, 2019 04:43 AM

Hiccup-women
కొందరికి అదేపనిగా వెక్కిళ్లు వస్తుంటాయి. కొందరు ఏడు గుక్కల నీళ్లు తాగాలని చెబుతుంటారు. ఇంకొందరు ఎవరో తిట్టుకుంటున్నారని అంటుంటారు. కానీ ఇవి సాధారణంగా గొంతులో నీటితడి ఆరిపోయినప్పుడు వస్తుంటాయి.


- వెక్కిళ్లు టక్కున ఆగిపోవాలంటే అరస్పూన్ పంచదారను నోట్లో వేసుకొని కాసేపు నాలుకపై ఉంచితే చాలు.
- ఐదుసార్లు గట్టిగా ఊపిరి పీల్చుకొని నెమ్మదిగా వదిలితే వెక్కిళ్లు ఆగిపోతాయి.
- గొంతులో నీటితడి లేకపోవడం కారణంగా వెక్కిళ్లు వస్తుంటాయి. వెక్కిళ్లు వచ్చిన వెంటనే కొన్ని నీళ్లు తాగితే వెక్కిళ్లు పోతాయి.
- గోరువెచ్చని నీళ్లలో కాసింత ఇంగువ వేసుకొని తాగినా వెక్కిళ్లు ఆగుతాయి.
- ఒక్కోసారి వెక్కిళ్లు ఎంతకీ ఆగకుండా విసిగిస్తుంటాయి. అలాంటప్పుడు ఉసిరిక ఆకుల్ని నమిలి మింగితే మంచి ఫలితముంటుంది.

458
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles