వంటింటి చిట్కాలు


Thu,September 12, 2019 04:41 AM

Beets
- బీట్‌రూట్‌ను సన్నగా తురిమి ఎండబెట్టి మెత్తని పొడిలా చేసుకొని ఫుడ్ కలర్‌గా ఉపయోగించుకోవచ్చు.
- అల్లం, మిరియాలు, యాలకులు మెత్తని పొడిలా చేసి.. టీలో కలిపితే రుచి రావడమే కాకుండా అజీర్తికి సంబంధించిన వ్యాధులు దరిచేరవు.
- లడ్డూలు గట్టిపడినడితే వాటిని బాగా పొడిచేసి ఒక లడ్డుకి చెంచా చొప్పున పాలు పోసి కలిపితే తాజా లడ్డులా తయారవుతాయి.
- హాట్ వాటర్‌బాటిల్‌లో ఎక్కువసేపు నీరు వేడిగా ఉండాలంటే చిటికెడు ఉప్పు ఆ నీటిలో కలిపితే చాలు.
- బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే వేపాకు వేసి నిల్వ ఉంచుకోవాలి.
- సీసాలోని పచ్చళ్లు చెడిపోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే.. సీసామూత చుట్టూ ఉప్పు రాయండి.
- పప్పులు నిల్వ చేసేటప్పుడు పురుగు పట్టకుండా ఉండాలంటే.. డబ్బా అడుగుభాగంలో క్రిస్టల్ ఉప్పు చల్లాలి.

483
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles