సేంద్రియ ఎరువులతో రైతులకు సాయం


Mon,September 9, 2019 01:38 AM

నగరాల్లో పేరుకుపోతున్న చెత్త పర్యావరణానికి ఆటంకంగా మారుతున్నది. మరోవైపు వ్యవసాయంలో రసాయనాలను వాడడం వల్ల భూమి దెబ్బతింటున్నది. ఈ పరిస్థితులను చూసి చెన్నైకి చెందిన దంపతులు వాటిని నివారించేందుకు కృషి చేస్తున్నారు.
rajarani
చెన్నైకి చెందిన రంజినీ, కెర్న్ అగర్వాల్ అనే దంపతులకు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటన మార్చేస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఉద్యోగాల రీత్యా తమిళనాడులోని కాంచీపురంలో పర్యటించిన ఈ దంపతులు పూర్తిగా అక్కడి రైతులతో గడపడానికి నిర్ణయించుకున్నారు. నగరాల్లో, గ్రామాల్లో ప్రధాన సమస్యగా ఉన్న వ్యర్థ పదార్థాల నిర్వహణపై దృష్టి సారించారు. ఈ చెత్తను సేకరించి, కంపోస్ట్ చేసి రైతులకు సేంద్రియ ఎరువు అందించాలని నిర్ణయించుకున్నారు. ఏడాది పాటు అధ్యయనం చేశారు. నగర శుభ్రత, సేంద్రియ భూమి కోసం 2017లో కార్బన్ లూప్స్ అనే స్టార్టప్‌ను స్థాపించారు. దీని ద్వారా చెత్తను సేకరించి కంపోస్ట్ చేయడం, అవసరమైన వారికి బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కాలేజీలు, గృహసముదాయాల్లో బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయించి, వాటి నిర్వహణ బాధ్యతలు తీసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చెత్తను సేకరించి కంపోస్ట్ కేంద్రాల ద్వారా సేంద్రియ ఎరువును ఉత్పత్తి చేస్తున్నారు. సాధారణంగా అక్కడి రైతులకు రెండు టన్నుల సేంద్రియ ఎరువు వెయ్యి రూపాయలకి లభిస్తుంది. కానీ రంజినీ దంపతులు కేవలం వంద రూపాయలకే అందిస్తున్నారు. ఇలా ఆయా సెంటర్లలో రోజుకు 5వేల టన్నుల వ్యర్థాలను సేంద్రియ ఎరువు, బయోగ్యాస్‌లోకి మారుస్తున్నారు. శుభ్రమైన నగరాలు, సారవంతమైన నేలలు అవసరమని వాటికోసం కృషి చేస్తున్నట్టు రంజినీ చెబుతున్నారు.
ranjini2

286
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles