పర్యావరణ హితం కోసం!


Mon,September 9, 2019 01:35 AM

ప్రతి ఒక్కరూ బాధ్యతగా నడుచుకున్నప్పుడే పర్యావరణం పది కాలాల పాటు సుభిక్షంగా ఉంటుంది. అందుకోసమే ఓ మహిళ పర్యావరణం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి ముందుకు వచ్చింది. నిరుపయోగంగా ఉన్న పరికరాలతో కళాత్మకమైన వస్తువులను తయారు చేస్తూ, ప్రకృతిని సంరక్షించే ప్రయత్నం చేస్తున్నది.
lifestyle-upcyled-decor
బెంగళూరుకు చెందిన సరిత అనే మహిళ నిరుపయోగంగా పడి ఉన్న ఇనుప సామగ్రిని కళాత్మకమైన వస్తువులుగా మారుస్తున్నది. సృజనాత్మకతతో అద్భుతమైన అలంకరణ ఉత్పత్తులను తయారు చేస్తూ పర్యావరణ సంరక్షణ కోసం పాటు పడుతున్నది. రస్త క్రీయేషన్స్ పేరుతో కళాత్మకమయిన వస్తువులతోపాటు కాలుష్య రహిత ఉత్పత్తులను రూపొందిస్తున్నది. karnival.com అనే ఈ- కామర్స్ వెబ్‌సైట్ ద్వారా ఈ ఉత్పత్తులను విక్రయిస్తున్నది. అలా విక్రయించగా వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని దివ్యాంగులు, పేదలసంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నది. నిరుపయోగంగా పడి ఉన్న బల్బులు, పాడయిన గడియారాలు, సీసాలు, సైకిల్ చక్రాలు, మోటర్ సైకిల్‌కు సంబంధించిన పరికరాలతో ఉపయోగకరమైన ఉత్పత్తులను ఏ విధంగా తయారు చేసుకోవచ్చో బెంగళూరు ప్రజలకు ప్రత్యేక క్లాసులు నిర్వహించి మరీ తెలియజేస్తున్నది. అందుకోసం వర్క్‌షాపులు నిర్వహిస్తూ పర్యావరణానికి మేలు చేస్తున్నది. పర్యావరణానికి హాని కలిగించని వస్తువులను వాడడం వల్ల కలిగే ఉపయోగాలను గురించి ప్రజలకు వివరిస్తున్నది.మనిషి సుభిక్షంగా బతకాలంటే భూమిని సంరక్షించుకోవాలి. భూమికి ప్రత్యామ్నాయం మరొక గ్రహం లేదని సరిత చెబుతున్నది. వీలయినంత వరకూ పర్యావరణ హితమయిన ఉత్పత్తులనే వాడాలని ఆమె సూచిస్తున్నది.

214
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles