ఐటీ కాదని అన్నపూర్ణగా..


Mon,September 2, 2019 01:02 AM

ఇంటి భోజనం కోసం ఆమె ఐటీ ఉద్యోగాన్ని వదిలేసింది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందరికీ అందించాలని ఆమె అన్నపూర్ణగా మారింది, బెంగళూర్‌కు చెందిన జయంతి.
jayanthi
జయంతిది సంప్రదాయ కుటుంబం. వారు బయట భోజనానికి చాలా దూరం. వారి ఆర్థిక స్థోమత, బయటి భోజనం ఆరోగ్యకరం కాకపోడమే కారణం. దీంతో ఇంటి ఆహారానికే వారి ప్రాధాన్యం. 2002లో ఉద్యోగ రీత్యా జయంతి ఆస్ట్రేలియా వెళ్లింది. అక్కడ బయటి ఆహారం గురించి ఆమెకు భయం వేసింది అయినా తప్పలేదు. ఆ ఏడాది వినాయక చవితి సందర్భంగా పాయసం, స్వీట్లు ఇంట్లో తయారు చేసింది. వాటిని ఇతరులకు అందించాలని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది. వాటికి ఆర్డర్లు రావడంతో ఆశ్చర్యపోయింది. రెండేండ్ల తర్వాత బెంగళూర్‌కు తిరిగొచ్చింది. ఉద్యోగం చేస్తూనే ఆమె మనసు మాత్రం దేశీ ఆహారం మీదకు మళ్లింది. స్థానిక వంటకాలను అందరికీ అందించాలనుకుంది. వడాపావ్, పోహా, స్వీట్లు, భోజనాన్ని మహారాష్ట్ర ప్రజలకు తెలియజేసింది. మహిళలకు ఉపాధి అవకాశం కల్పిస్తూ పూర్ణబ్రహ్మ అనే రెస్టాంట్‌ను ఏర్పాటు చేసింది. కొద్ది రోజుల్లోనే మరో పది రెస్టారెంట్లను ఏర్పాటు చేయగలిగింది. అందులో 70 శాతం మంది మహిళలే ఉండగా, దేశీ, సంప్రదాయ పద్ధత్తుల్లో ఆహారం అందిస్తున్నది. భోజనం పూర్తిగా తింటే బిల్లులో 5శాతం తగ్గింపు, వదిలేస్తే 2శాతం అధిక బిల్లు విధిస్తుంది. ఇలా మహారాష్ట్ర, ముంబై, పుణే, అమరావతి ప్రాంతాల్లో ఈ రెస్టారెంట్లను విస్తరించింది.
jayanthi1

530
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles