బీపీ తెలిపే సెల్ఫీ!


Tue,August 13, 2019 01:23 AM

బీపీ వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన, గుండెపోటు వంటి సమస్యలు వస్తున్నాయి. అందుకే అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ప్రతీసారి డాక్టర్‌ను సంప్రదించలేం. ఆధునిక సాంకేతిక పరికరాల ద్వారా బీపీని గుర్తించి అప్రమత్తం కావచ్చు అని అంటున్నారు నిపుణులు.
Video-Selfie
వీడియో సెల్ఫీతో రక్తపోటు తెలుసుకోవచ్చునని అంటున్నారు కెనడా పరిశోధకులు. యూనివర్సిటీ ఆఫ్ టొరంటోకు చెందిన పరిశోధకులు దీనిని తయారుచేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ప్రయోగాలు చేసి ఓ నిర్ధారణకు వచ్చారు. చర్మం లోపల చిత్రాలు తీసే సాఫ్ట్‌వేర్‌తో పలువురు ముఖాలు వీడియో తీసి రక్తపోటు వివరాలను సేకరించారు. ఒక్కొక్కరిపై సుమారు రెండు నిమిషాలు ఈ పరీక్ష చేశారు. వీటిని భౌతికంగా సేకరించిన వివరాలతో సరిపోల్చి మెషీన్ లెర్నింగ్ పద్ధతుల ద్వారా రక్తప్రసరణలోని మార్పులను గుర్తించారు. దీని ఆధారంగానే రక్తపోటును లెక్కగట్టారు. దీని ద్వారా 95% కచ్చితత్వంతో కాలిక్యులేషన్స్ ఉన్నట్లు టొరంటో యూనివర్సిటీ పరిశోధకులు స్పష్టం చేశారు. దీనిని మరింత డెవలప్ చేసి అర నిమిషంలో వీడియో సెల్ఫీ ద్వారా బీపీని లెక్కపెట్టగలిగే విధానాన్ని రూపొందించనున్నట్లు వారు వివరించారు.

70
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles