మంచి రాబడి.. పన్ను ప్రయోజనం


Sat,July 27, 2019 12:32 AM

అధిక శాతం పన్ను పోటును తప్పించుకోవడానికి.. క్రమం తప్పకుండా ఆదాయాన్ని అందించే పొదుపు పథకాలను ఎంచుకోవాలి. మరి, ఇందుకోసం మనకు అందుబాటులో పన్ను ఆధారిత పథకాలు ఏమేం ఉన్నాయంటే..
big-tax
యూనిట్ ఆధారిత బీమా పథకాలను యూలిప్‌లుగా పిలుస్తారు. దీన్ని ప్రత్యేకత ఏమిటంటే.. బీమా రక్షణను అందించడంతో పాటు పెట్టుబడి మీద ఆదాయం కూడా అందజేస్తుంది. ఇందులో పెట్టుబడి పెడితే, గరిష్ఠంగా రూ.లక్షన్నర దాకా పన్ను ప్రయోజనాన్ని అందుకోవచ్చనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించినప్పుడే పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఒకవేళ, రెండేండ్ల కంటే ముందే, యులిప్‌లో మదుపు చేయడం నిలిపివేస్తే మాత్రం.. ఎలాంటి ఉపయోగమూ ఉండదని గుర్తుంచుకోండి. కొందరు తెలివిగా ఏం చేస్తారంటే, మొదటి ఏడాది పన్ను ప్రయోజనాన్ని అందుకుని, రెండో ఏడాది యులిప్‌లో పెట్టుబడి పెట్టడాన్ని హఠాత్తుగా నిలిపివేస్తారు. దీంతో, మొదటి ఏడాది తగ్గిన సొమ్మును రెండో ఏడాది ఆదాయంంగా పరిగణిస్తారు. కాబట్టి, ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలి.


పెన్షన్ ప్లాన్లు..

వీటిని రిటైర్మెంట్ ప్లాన్లుగా పిలుస్తారు. ఇందులో మదుపు చేస్తే బీమా సౌకర్యాన్ని కల్పించడంతో పాటు పెట్టుబడి ప్రయోజనాన్ని అందుకోవచ్చు. ఇందులో క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే సరిపోతుంది. సెక్షన్ 80సీసీసీ కింద పన్ను మినహాయింపూ ఉంటుంది.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు..

భారతదేశంలోని అన్ని పోస్టాఫీసుల్లో లభ్యమయ్యే పథకమే.. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్. ఐదేండ్లు లేదా పదేండ్ల కాలానికి సొమ్ము పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. గరిష్ఠంగా పెట్టే పెట్టుబడి మీద ఎలాంటి పరిమితి ఉండకపోవడమే సానుకూలాంశం. ఇందులో పెట్టే సొమ్ముపై గరిష్ఠంగా ఎనిమిది శాతం దాకా వడ్డీని అందుకోవచ్చు. ఈ శాతం అటూఇటూ మారే వీలుంది. సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపును అందుకోవచ్చు. వడ్డీపై ఎలాంటి పన్నూ ఉండదు.

297
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles