బగ్ ఉందని చెప్పాడు నగదు అందుకున్నాడు


Tue,June 11, 2019 11:40 PM

సామాజిక మాధ్యమాల్లో మనకు తెలియకుండా ఎన్నో బగ్స్ ఉంటాయి. మనకే కాదు అవి యాజమాన్యాలకూ కూడా తెలియకుండా ఉంటాయి. వాటి వల్ల హ్యాకర్లు తమ పని సింపుల్‌గా చేయడం సాధ్యం అవుతుంది. ఇలా యూజర్‌కు, కంపెనీకి నష్టం కలిగించే బగ్ ఒకటి కేరళకు చెందిన బీటెక్ విద్యార్థికి కనిపించింది. వెంటనే మార్క్ జూకర్‌బర్గ్‌కు లెటర్ రాశాడు.. తర్వాత ఏం జరిగింది?
kerala-student
ఫేస్‌బుక్ గ్రూప్‌కు చెందిన వాట్సాప్‌లో ఓ హానికర బగ్‌ను గుర్తించాడు కేరళకు చెందిన అనంత కృష్ణన్. యూజర్లకు తెలియకుండా వాట్సాప్‌లో కొన్ని ఫైళ్లను, ఇతర సమాచారాన్ని ఇతరులు డెలిట్ చేయడానికి అవకాశం ఉండే బగ్‌ను గుర్తించాడు. దీని గురించి ఫేస్‌బుక్ ఫౌండర్ మార్క్ జూకర్‌బర్గ్‌కు సమాచారం అందించాడు. ఆ బగ్ ఏంటీ? ఎందుకు వచ్చింది? ఎలా తీయాలి అని వివరంగా లెటర్ రాశాడు. దీన్ని రెండు నెలల పాటు పరిశీలించిన ఫేస్‌బుక్ ఆ బగ్ నిజమేనని, తొలగించడానికి చర్యలు తీసుకుంది. దీంతో అనంత కృష్ణన్ ప్రతిభకు మెచ్చిన జూకర్‌బర్గ్ అనంత కృష్ణన్‌కు ఐదు వందల డాలర్ల ( రూ. 35 వేలు) నగదును అందించాడు. దీంతో పాటు ఫేస్‌బుక్ ఆల్ ఆఫ్ ఫేమ్ థాంక్స్ లిస్ట్‌లో ఆనంత కృష్ణన్‌కు చోటు కల్పించాడు. తన లేఖను పరిశీలించినందుకు ఈ స్టూడెంట్ ఫేస్‌బుక్‌కు కృతజ్ఞతలు తెలిపాడు.

969
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles