ఇక ఇన్‌స్టాలో..


Tue,June 11, 2019 11:38 PM

పాపులర్ లిప్‌సింకింగ్ యాప్ టిక్‌టాక్‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్ ఫీచర్‌ను అప్‌డేట్ చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
insta
ఇప్పుడు టిక్ టాక్ స్టోరీల మాదిరిగానే ఇన్‌స్టాలోనూ క్రియేట్ చేయొచ్చు. ఈ ఫీచర్‌ను ఇన్‌స్టా యూజర్ల కోసం ఇటీవలే రిలీజ్ చేసింది. అప్‌డేటెడ్ యాప్‌లో ఇన్‌స్టా మ్యూజిక్ సపోర్ట్‌తో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఆన్ స్క్రీన్ లిరిక్స్ పేరుతో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. యూఎస్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలలతో పాటు మరి కొన్ని దేశాల పాటల లిరిక్స్‌ను పొందుపరిచింది. ఈ ఫీచర్‌ను యాక్సెస్ చేయడానికి ఇన్‌స్టా యాప్‌ను అప్‌డేట్ చేసి యూస్ చేయడమే.. స్టోరీ క్రియేట్ చేస్తున్నప్పుడు మ్యూజిక్ లెన్స్‌ను ఎంపిక చేసుకోవాలి. తర్వాత షూటింగ్ స్టార్ట్ చేయాలి. అప్పుడు వెంటనే మీరు ఎంచుకున్న పాటకు సంబంధించిన లిరిక్స్ అన్నీ స్క్రీన్‌మీద స్క్రోల్ అవుతూ ఉంటాయి. వాటిని అనుసరిస్తూ లిప్ సింక్ చేయాలి. పర్ఫెక్ట్ లిప్ సింకింగ్ రావడానికి యూజర్ల కోసం ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్ట్టు ఇన్‌స్టా తెలిపింది. ఇండియా యూజర్లకు త్వరలోనే దీనిని అందిస్తామని పేర్కొన్నది.

324
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles