ఇలా చేస్తేనే మీ వాట్సప్ కల్లాస్..


Wed,June 5, 2019 12:57 AM

వాట్సప్‌లో భద్రతా కారణాలు ఈ మధ్య కఠినతరం అయ్యాయి. కొంచెం ఆషామాషీగా వ్యవహరించినా మీ వాట్సప్ ఖాతా బ్యాన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ ఖాతాను కాపాడుకోవాలంటే చేయకూడని పనులు ఉన్నాయి. అవేంటో ఫాలో అవండి...
WhatsApp
-సెక్లన్ల వ్యవధిలో పదుల సంఖ్యలో సందేశాలు పంపడం. బాల్క్ మెసేజ్‌లు, ఆడియోలు, వీడియోలు, ఈమెజ్‌లు ఫార్వర్డ్ చేయడం
-నిమిషాల వ్యవధిలో గ్రూప్‌ల క్రియేట్..
-గ్రూపుల్లో ఒకేసారి పదుల సంఖ్యలో మెంబర్లను యాడ్ చేయడం
-తరచూ లింకులు షేర్ చేయడం
-అకౌంట్‌పై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రాయడం
-వివాదాస్పద, అనుమానాస్పద, నేర ప్రేరేపిత సందేశాలు, వీడియోలు, ఈమెజ్‌లు షేర్ చేయడం
-వాట్సప్ సర్వర్లను హ్యాక్ చేసే లింకులు పంపడం
-వాట్సప్ కోడ్‌ను మార్చే ప్రయత్నం చేయడం
-అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు తప్పుడు సమాచారం ఇవ్వడం
-తరచూ అకౌంట్ నంబర్లను మార్చడం
ఇలాంటి పనులు తరచూ చేయడం వల్ల వాట్సప్ ఖాతా బ్యాన్ అయ్యే అవకాశం ఉంది. మీరు చేసిన వాట్సప్ వయోలెన్స్ తీవ్రతను బట్టి తాత్కాలికంగా మీ ఖాతాను బ్యాన్ చేస్తుంది. అదే సందేశాన్ని మీకు పంపిస్తుంది. దీన్ని నుంచి బయట పడ్డ తర్వాత కూడా మీరు నిబంధనలు ఉల్లంగిస్తే మీ ఖాతా క్లోజ్ అవడం ఖాయం.. ముందస్తు హెచ్చరిక లేకుండానే ఆ సంస్థ మీ ఖాతాను బ్యాన్ చేయగలదు. ఇది నిబంధన వాట్సప్ టర్మ్స్ అండ్ కండీషన్స్‌లో ఉంటుంది. దీన్ని మనం ఒప్పుకొన్నాకే ఖాతాను క్రియేట్ చేసుకొనే అవకాశం ఉంది.

1638
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles