మోనాలిసాకు ప్రాణమొచ్చింది


Wed,June 5, 2019 12:54 AM

monalis
ప్రపంచ చిత్రలేఖన చరిత్రలో నిలిచిపోయిన ప్రఖ్యాత మోనాలిసా పెయింటింగ్‌కు ప్రాణమొచ్చింది. లియొనార్డో డా విన్సీ గీసిన ఆ చిత్రానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అధ్యయనకారులు ప్రాణం పోశారు. మాస్కోలోని సామ్‌సంగ్ ఆర్టిఫీషియల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ మోనాలీసాకు ఈ కదలికలను సృష్టించింది. ఆ పెయింటింగ్ ఆధారంగా ఆమె కండ్లు, పెదాలు, ముఖాన్ని కదిలించారు. దీనికి కోసం డీప్ఫేక్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ టెక్నాలజీ ద్వారా ఇప్పటికే సాల్వడోర్ డాలి, ఆల్బర్ట్ అయిన్‌స్టీన్, ఫీదోర్ దోస్తెయెవ్స్కీతోపాటు, మార్లిన్ మన్రో వీడియోలను కూడా రూపొందించారు. సామ్‌సంగ్ బృందం, తాము సృష్టించినవాటి గురించి ఒక పేపర్లో వివరిస్తూ.. ఇవన్నీ నాడీ నిర్మితమైన ముఖాలతో మాట్లాడుతున్నట్లే కనిపిస్తాయి అని తెలిపింది. ఈ విధానం ఎలా పనిచేస్తుందో వివరిస్తూ ఓ వీడియోను కూడా రూపొందించింది.

158
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles