జిప్ సైక్లింగ్..అమేజింగ్!


Fri,May 31, 2019 01:28 AM

ఈ చిత్రాలను చూసి ఎక్కడో ఫారెన్ అనుకునేరు. అస్సలు కాదు. మన తెలంగాణ. మన సిద్దిపేట. సాహస క్రీడలకు అడ్డాగా మారిన కోమటి చెరువులో ఇప్పుడు అమేజింగ్ జిప్ సైక్లింగ్ అందుబాటులోకి వచ్చేసింది.
CYCKILNG
కోమటి చెరువు రాష్ట్రానికే రోల్‌మోడల్‌గా మారుతుంది. తన అందాలతో సిద్దిపేట పట్టణ ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల పర్యాటకులను ఆకర్షిస్తున్న కోమటి చెరువు మినీ ట్యాంక్‌బండ్ మరో సాహస క్రీడ సాధనకు ముస్తాబైంది. ఆ సాహస క్రీడే జిప్ ైస్లెకింగ్. దీనిని రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేటలో నిర్మించేందుకు ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రత్యేక చొరవ చూపారు. దీంతో మరింత మంది పర్యాటకులు కోమటి చెరువుకు రానున్నారు. కోమటి చెరువు పర్యాటక కేంద్రంగానే కాకుండా సాహస క్రీడలకు వేదికగా మారుతుంది. రోప్‌వే, అడ్వెంచర్ పార్కులాంటి సాహస క్రీడలతో ఇప్పటికే అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా జిప్ సైక్లింగ్‌ను ఏర్పాటు చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు సాహస క్రీడలకు కోమటిచెరువు ప్రాంతం నెలవుగా మారింది. మొన్న ఎమ్మెల్యే హరీశ్‌రావు ఈ జిప్ సైక్లింగ్‌ను ప్రారంభించి పర్యాటకులకు, పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

504
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles