వచ్చేసింది క్యూ


Wed,May 29, 2019 12:55 AM

ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో సెర్చ్ దిగ్గజం గూగుల్ మరో ముందడుగు వేసింది. గత కొన్ని నెలల క్రితం ప్రకటించిన ఆండ్రాయిడ్ క్యూ ఓఎస్‌ను ఎట్టకేలకు లాంచ్ చేసింది. ఇటీవల అమెరికాలో జరిగిన సదస్సులో దీన్ని
రిలీజ్ చేసింది. బీట వెర్షన్‌లో కొన్ని మొబైల్ పాట్నర్ కంపెనీలకు దీన్ని అందుబాటులోకి తెచ్చింది.

tab
యూఎస్‌లో రెండు వారాల క్రితం గూగుల్ ఐ/ఓ 2019 డెవలపర్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సదస్సులో గూగుల్ ఈ ఓఎస్‌ను రిలీజ్ చేసింది. గూగుల్ Android Qలో సరికొత్తగా ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్ రిప్లై, స్మార్ట్ సజెషన్స్, లైవ్ క్యాప్షన్, డిజిటల్ వెల్బీయింగ్, డార్క్ థీమ్ లాంటి ప్రత్యేకతలు ఎన్నాయి. దీంతో పాటు కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌లో సిస్టమ్ వైడ్ డార్క్ థీమ్ కూడా పొందుపరిచింది. అట్లాగే ఆండ్రాయిడ్ క్యూ 5జీ కనెక్టివిటీని సపోర్ట్ చేయనుంది.

ఫీచర్లు...

1స్మార్ట్ మెసేజింగ్

మెసేజింగ్ యాప్‌లు వాడేప్పుడు సులభమైన పద్ధతులు ఉంటే బాగుండు అనిపిస్తుంది. కీబోర్డ్ ప్రెడిక్షన్, డిక్షనరీ ఇందుకు సాయపడతాయి. వాటికన్నా అడ్వాన్స్ ఫీచర్లను ఆండ్రాయిడ్ క్యూలో చూడొచ్చు. స్మార్ట్ మెసేజింగ్, స్మార్ట్ సజెషన్ ఫీచర్లు ఉన్నాయి. మెషీన్ లెర్నింగ్ ఫీచర్‌ను గూగుల్ యూజర్లకు అందుబాటులోకి తెస్తున్న విషయం తెలిసింది. క్యూలో ప్రత్యేకంగా పొందుపరిచిన స్మార్ట్ రిప్లయ్, స్మార్ట్ సజెషన్స్ ఫీచర్లు కూడా అలాంటివే. ఇకపై మీరు మీ మెసేజింగ్ యాప్‌లో ఈ ఫీచర్లను సులభంగా వాడుకోవచ్చు. దీని ద్వారా మీకు వచ్చిన మెసేజ్ కంటెంట్‌ను అర్థం చేసుకని అందుకు కావాల్సిన రిప్లయ్‌ని గూగుల్ సజెస్ట్ చేస్తుంది. అవతలి వ్యక్తి మాట్లాడిన మాటలను వాయిస్ రూపంలో వినిపిస్తుంది. దీనికి ఇంటర్ నెట్‌తో పని లేదు.

2లైవ్ క్యాప్షన్

యూట్యూబ్‌లో మీరేదో ఇతర భాషల వీడియో చూస్తుంటారు. ఒక్కోసారి ఆ భాష అర్థం కాదు. వీడియో కాల్, వాయిస్ మెసెజ్ చేసినా ఇలాంటి సమస్యలు వచ్చిపడుతుంటాయి. అయితే ఇలాంటి ఇబ్బందులకు క్యూ చెక్ పెట్టేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉన్న లైవ్ క్యాప్షన్ ఫీచర్ అటోమేటిక్‌గా క్యాప్షన్లను, సబ్‌టైటిళ్లను జనరేట్ చేస్తుంది. యూట్యూబ్, వీడియోకాల్‌లో ఉన్నప్పుడు ప్లే అవుతున్న వీడియోలోని మాటలను సబ్‌టైటిళ్లుగా మార్చి కింద చూపిస్తుంది.

3గూగుల్ అసిస్టెంట్ కొత్తసేవలు

క్యూలో గూగుల్ అసిస్టెంట్ సేవలు మరింత మెరుగయ్యాయి. ఉదాహరణకు టికెట్, హోటల్ బుక్ చేసుకోవడం, రిమైండర్లు సులభంగా చేస్తుంది. తర్వాతి ప్రయాణానికి టికెట్ బుకింగ్ కమండ్ ఇచ్చినప్పుడు వెంటనే మీ క్యాలెండర్ షెడ్యుల్‌ను బట్టి అందుబాటులో ఉండే ట్రావెలింగ్ సర్వీస్ వివరాలు అందిస్తుంది. ఒక్కసారి వివరాలు ఇస్తే చాలు పేమెంట్ గేట్‌వేకు తీసుకెళ్తుంది. అట్లాగే మ్యూజిక్ ప్లేయర్, కాల్ లాగ్‌ను వాడడానికి తరచూ స్క్రీన్‌ను వాడాల్సిన పని లేదు జస్ట్ అసిస్టెంట్‌కు చెప్తే సరిపోతుంది. పాటలు వరుసగా ప్లే చేయడం, మధ్యలో కాల్ వస్తే అనుమతి అడిగి లిఫ్ట్ చేయడం, అయిపోయాక మనం చెప్పింది విని కట్ చేయడం అంతా చేసిపెడుతుంది.

4డిజిటల్ వెల్ బీయింగ్

కిందటి ఏడాది రిలీజ్ అయిన ఆండ్రాయిడ్ 9 ఓఎస్‌లో డిజిటల్ వెల్‌బీయింగ్ ఉంది. ఈ ఫీచర్లో మరిన్ని మార్పులు చేసి క్యూలో అప్‌డేట్ చేసింది. చాలా మంది ఫోన్లో రకరకాల యాప్స్ ఇన్‌స్టాల్ చేస్తుంటారు. వాటిని కొన్ని రోజుల తర్వాత వాడకుండా అలాగే వదిలేస్తారు. అయినా వాటి నుంచి నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. వీటి వల్ల బ్యాటరీ తగ్గుతుంది. అలాంటి వాటిని రివ్యూ చేసి మ్యూట్ చేస్తుంది డిజిటల్ వెల్‌బీయింగ్ ఫీచర్. అందుకోసం ఫోకస్ మోడ్‌ను పొందుపరిచింది. ఈ ఆప్షన్‌లో మీరు ఎంచుకున్న యాప్స్‌తో నోటిఫికేషన్ల ఇబ్బంది ఉండదు.

5మరి ప్రైవసీ ?

ఇన్ని స్మార్ట్ ఫీచర్లను పరిచయం చేస్తున్నది సరే.. మరి ప్రైవసీ సంగతి ఏంటి అనుకుంటున్నారా? గూగుల్ ఎప్పటికప్పుడూ యూజర్ ప్రైవసీకి ప్రాధాన్యం ఇస్తూనే వస్తున్నది. క్యూలో కూడా ప్రైవసీ ఆప్షన్లు మెరుగుపరిచింది. గూగుల్‌లో లాగిన్ అయి ఉన్న ప్రొఫైల్ ఐకాన్ పై క్లిక్ చేసే.. ఆక్టివిటీ లాగ్ కనిపించినట్టే యువర్ డేటా ఇన్ సెర్చ్ అనే ఆప్షన్‌ను సూచిస్తుంది.దీని ద్వారా మీ రీసెంట్ ఆక్టివిటీని చూసుకోవచ్చు. అవసరమైతే అటోమేటిక్‌గా డిలీట్ చేయవచ్చు. సెర్చ్ డేటా ఎన్ని రోజులు ఉండాలి, ఎప్పుడు డెలీట్ అవ్వాలి అనే ఆప్షన్లు ఉన్నాయి.

ఆండ్రాయిడ్ పీలో డార్క్ మోడ్ థీమ్ లో పలు రకాల ఫీచర్లను అందించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌లో సిస్టమ్ వైడ్ డార్క్ థీమ్ అందించారు. ఓలెడ్ స్క్రీన్ ఫోన్ వాడుతున్నవారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ఇంకా సిస్టమ్ లెవల్ స్క్రీన్ రికార్డింగ్ ఫీచర్ ఉంది. ఇక పవర్ బటన్ను ప్రెస్ చేయడం ద్వారా ఎమర్జెన్సీ కాల్స్ చేసుకునే విధంగా సిస్టమ్ యూఐని తీర్చిదిద్దారు. ఫోల్డబుల్ డివైజ్‌లలో కూడా దీన్ని వాడుకొనేందుకు వీలుంది. ఆండ్రాయిడ్ క్యూ బీటా వర్షన్ గూగుల్ ఫోన్లలో డైరెక్ట్ అప్‌డేట్ చేసుకోవచ్చు. అట్లాగే కొన్ని పాట్నర్ మొబైల్ కంపెనీలకు ఈ ఓఎస్ సపోర్ట్ చేస్తుంది. వాటిలో సాంమ్సంగ్ గెలాక్సీ ఎస్10, ఎస్10ఈ, ఎస్9, ఎస్9+, నోట్ 9, వన్‌ప్లస్6, 6టీ, 7, 7ప్రో, హువాయి మేట్ 20 ప్రో, ఎల్‌జీ జీ, ఒప్పో రెనో, రియల్ మీ 3 ప్రో, సోనీ ఎక్స్‌జీరియా ఎక్స్‌జెడ్3, వీవో ఎక్స్27, వీవీఓ న్‌ఈఎక్స్ ఏ, ఎస్, షావోమీ ఎంఐ మిక్స్3, ఎంఐ9 ఉన్నాయి. ఆండ్రాయిడ్ డెవలప్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్ చూసుకోవచ్చు. ఈ ఏడాది చివరి నాటి మరిన్ని ఫోన్లకు క్యూ ఓఎస్ లభించనున్నది.
...?వినో

723
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles