యుద్ధ విమానాలు నడిపే వీర వనిత!


Sun,May 26, 2019 01:43 AM

యుద్ధ విమానాలు నడపాలంటే మాటలు కాదు.. అత్యంత సాహసోపేతమైన పని. ఈ రంగంలో శక్తియుక్తులే కాదు ధైర్య, సాహసాలు కావాలి. భారతవైమానిక దళంలో తొలిసారిగా యుద్ధ విమానంలో పోరాట ఆపరేషన్లు చేపట్టేందుకు లెఫ్టినెంట్ భావనకాంత్ అర్హత సాధించింది.
bhavana-kanth
మిగ్-21 బైసన్ విమానంపై పోరాటానికి సంబంధించిన శిక్షణను భావనకాంత్ పూర్తి చేసింది. ఈ శిక్షణ పూర్తి చేయడంతో ఆమె భారతవైమానిక దళంలో ఉండే యుద్ధ విమానాల్లో పోరాట ఆపరేషన్లు చేపట్టేందుకు అర్హురాలైంది. పగటి పూటనే కాకుండా, రాత్రి పూట కూడా ఈ యుద్ధవిమానాన్ని నడిపేందుకు శిక్షణ తీసుకోనుంది. దీన్నే డార్క్ ఫేజ్ అని కూడా అంటారు. త్వరలోనే ఏ వేళలోనైనా ఈ యుద్ధ విమానాలు నడిపేలా ఆమె శిక్షణ పూర్తి చేసుకోనుంది. ప్రస్తుతం భావన రాజస్తాన్‌లోని బికనీర్ వైమానిక కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నది. 2017లో ఫైటర్ స్కాడ్రన్‌లో చేరిన ఆమె 2018 మార్చిలో తొలిసారిగా మిగ్-21బైసన్ యుద్ధ విమానాన్ని నడిపింది. యుద్ధ విమానాలను నడిపేందుకు మహిళలకు అవకాశం ఇవ్వాలని బీజేపీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భావనకాంత్‌కు అవకాశం లభించింది. యుద్ధవిమానంపై పగటిపూట యుద్ధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆమె అన్ని రకాల అర్హతలూ సాధించింది. దీంతో యుద్ధ విమానాలను నడిపే తొలి మహిళగా భావన చరిత్ర సృష్టించింది. ఇప్పటికే వాయుసేనలో అవనీ చతుర్వేది, మోహన సింగ్ అనే ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.

915
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles