ప్లాస్టిక్‌ను అరికట్టే ప్రయత్నం!


Thu,May 23, 2019 12:17 AM

divya
ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించడానికి ఎందరో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఫంక్షన్లు, ఈవెంట్ల దగ్గర ఎంత మేరకు వాడకం తగ్గించినా ప్లాస్టిక్ వస్తువులు కనిపిస్తూనే ఉన్నాయి. దీన్ని అరికట్టేందుకు దివ్యా రవిచంద్రన్ ఓ సంస్థకు శ్రీకారం చుట్టింది.

భారతదేశంలో ఏటా 62 మిలియన్ల ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. వీటిలో 60 శాతం ప్లాస్టిక్‌ను సేకరిస్తున్నారు. 15 శాతం రీసైకిల్ చేస్తున్నారు. మామూలుగా అయితే.. తడి, పొడి చెత్త పదార్థాలను విడివిడిగా ఉంచాలి. అప్పుడే వాటిని రీసైకిల్ చేయడానికి వీలుంటుంది. ఈ విషయాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దివ్యా రవిచంద్రన్ స్క్రాప్ సంస్థని స్థాపించడానికి పూనుకున్నది. 2017లో ముంబైలోని డియోనార్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. అది దివ్య ఇంటికి దగ్గరగా ఉంటుంది. ఆ సమయంలో మంటల్లో కాలి బూడిదైన వస్తువులు మినహా ప్లాస్టిక్ అలాగే ఉండిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆ ప్రదేశంలో పిల్లలు ప్లాస్టిక్‌తో ఆడుకొని అనారోగ్యానికి గురయ్యారు. ఇది చూసి దివ్య మనసు చలించింది. వెంటనే స్క్రాప్ సంస్థను స్థాపించి.. ఇతరుల సాయంతో ప్లాస్టిక్‌ను తీసి రీసైకిల్ చేసింది.

ఇలా మరొకసారి జరగకుండా ఉండడానికి దివ్యా ఒక టీమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ టీం సభ్యులు కలిసి చుట్టూ ఉన్న ప్రదేశాల్లోని ప్లాస్టిక్‌ను సేకరిస్తారు. వీరు మాత్రమే కాకుండాఆసక్తి ఉన్నవారు కూడా ఇందులో పాల్గొనేలా అన్ని చోట్ల డస్ట్ బిన్స్ పెడుతున్నారు. డస్ట్‌బిన్‌ల వాడకం తెలియజేస్తున్నారు. వీటితో పాటు పలు చోట్ల సమావేశాలు ఏర్పాటు చేసి వ్యర్థ పదార్థాలను డస్ట్‌బిన్‌లో వేసి ప్లాస్టిక్‌ను అరికట్టాలంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

405
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles