మందులతో రాళ్లు కరుగుతాయా?


Thu,May 23, 2019 02:15 AM

Councelling
నా వయసు 40 ఏండ్లు. కొంతకాలంగా కడుపులో మంట, నొప్పి వస్తున్నది. తెలిసిన డాక్టర్‌ను సంప్రదిస్తే కడుపులో చిన్నసైజు పుండు ఏర్పడి ఉండవచ్చు అన్నారు. ఆందోళన పెరగడంతో స్పెషలిస్ట్‌ను సంప్రదించాను. అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీస్తే పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్లు చెప్పారు. ఇవి మందులతో తగ్గుతాయా? ఆపరేషన్ చేయించుకోవాలా తెలియజేయగలరు.
- కె.శ్రీధర్, వనస్థలిపురం


సాధారణంగా వయసు పెరిగేకొద్దీ పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది. పిత్తాశయంలో రాళ్లు ఉన్నంత మాత్రాన ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ ఈ రాళ్ల్లు తరుచూ నొప్పి కలిగిస్తుంటే పిత్తాశయాన్ని తొలగించాల్సి ఉంటుంది. మీ లక్షణాలను పరిశీలిస్తే.. మీరు యాసిడ్ పెప్టిక్ వ్యాధితో బాధపడుతున్నారు అనిపిస్తున్నది. కానీ మీ సమస్య పిత్తాశయానికి సంబంధించింది కాదు అని తెలుస్తున్నది. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆలస్యం చేయకుండా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలిసి మరొకసారి అన్ని రకాల పరీక్షలు చేయించుకోండి.

మీరు ఇప్పటికే రెండు రకాల అనుమానాలు కలిగి ఉన్నారు కాబట్టి ఆలస్యం ఏమాత్రం చేయవద్దు. మీరు చేసే పని.. శరీర బరువు తెలపలేదు. దానిని పరిగణలోకి తీసుకొని మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. బరువైన ఎక్సర్‌సైజులు కుదరకపోతే కనీసం ఓ అరగంటపాటు వాకింగ్ అయినా చేయాల్సి ఉంటుంది. ఆల్కహాల్‌కు దూరంగా ఉండడం కూడా మంచిది.

డాక్టర్ ఆశా సుబ్బలక్ష్మీ
గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్
కేర్ హాస్పిటల్స్, హైటెక్‌సిటీ

1448
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles