ఎలిజబెత్ పిలుస్తున్నది


Thu,May 23, 2019 01:29 AM

Elizabeth
లండన్‌లో ఉద్యోగం.. లక్షల్లో సంపాదించే అవకాశం. మూడు పూటలా భోజనం, విలాసవంతమైన జీవితం, బకింగ్‌హాం ప్యాలెస్‌లో నివాసం. ఇలాంటి జీవితం గడపాలనుందా? అందుకోసం క్వీన్ ఎలిజబెత్ పిలుస్తున్నది.

లక్షల్లో జీతం ఇచ్చి, ప్యాలెస్‌లో గడపడానికి క్వీన్ ఎలిజబెత్ పిలవడం ఏంటి అనుకుంటున్నారు కదా! అవును నిజమే.. బ్రిటీష్ రాణి ఎలిజబెత్ దగ్గర ఉద్యోగ అవకాశాలు ఉన్నాయట. ఈ మేరకు వారి అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటన చేశారు. తన దగ్గర సోషల్ మీడియా మేనేజర్‌గా పని చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. సోషల్ మీడియా మీద పట్టు, ఫీచర్ రైటింగ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో ఎలిజబెత్ షెడ్యూల్‌ను అందించడం, ప్రపంచానికి వారి ఉనికిని తెలియజేయడం సోషల్ మీడియా మేనేజర్ పని. సోషల్ మీడియా ద్వారా ప్రజలతో ఎంగేజ్ అవడం, సమావేశాలకు హాజరై కుటుంబం గురించి అందరికీ తెలుపాలి. వెబ్‌సైట్ల నిర్వహణ,

పరిశోధించి ఫీచర్ స్టోరీ రాయడం, సోషల్ మీడియాలో రోజు వారి సందేశాలు అందించడం ముఖ్యమైన పని. ఏటా 33 రోజుల సెలవు, మూడుపూటలా ఉచిత భోజనం, ప్యాలెస్‌లో వసతితో పాటు నెలకు రూ.27లక్షల జీతం ఇస్తున్నట్టు వెబ్‌సైట్లో ప్రకటించారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉండి, పైన తెలిపిన నైపుణ్యాలు ఉంటే ఈ ఉద్యోగానికి అర్హులు. ఇతర వివరాల కోసం theroyalhousehold.tal.net చూడండి.

1058
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles