అక్కడ మాత్రమే అలా..


Thu,May 23, 2019 01:22 AM

vishesha
అద్భుతాన్ని చూస్తే ఆశ్చర్యపోతాం. ఆశ్చర్యాన్ని చూస్తే మైమరచిపోతాం. ఇలాంటి కొన్ని వింతల్ని చూస్తే ముక్కున వేలేసుకుంటాం. జపాన్‌లో మాత్రమే జరిగే కొన్ని వింతలూ, విశేషాల గురించి ఈ ప్రత్యేక కథనం. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశాల్లో జపాన్‌ ఒకటి. మిగతా దేశాలతో పోలిస్తే పదేండ్ల ముందే వాళ్ల ఆలోచనలు, ఆచరణలు ఉంటాయి. తూర్పు ఆసియాలోని ద్వీపదేశం ఇది. పసిఫిక్‌ మహా సముద్రంలో ఉంది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో ఈ దేశంలోని హిరోషిమా, నాగసాకి పట్టణాలపై అణుబాంబుల దాడి చోటుచేసుకోవడంతో జపాన్‌ పనైపోయిందని అంతా అనుకున్నారు. కానీ, అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ జపాన్‌ శిథిలాల నుంచి లేచింది. తిరిగి నిలబడింది. ఆధునిక కాలంతోపాటు అభివృద్ధిలో అత్యంత ముందంజలో ఉండే జపాన్‌లో.. మరే దేశంలోనూ చోటుచేసుకోని కొన్ని వింతలు మనకు కనిపిస్తుంటాయి. సంస్కృతి, సంప్రదాయాలు, నేపథ్యాలను బట్టి ఇవి మారుతుంటాయి. అవి రోజూ చూసేవారికి సాధారణంగానే అనిపించినా కొత్తగా చూసేవాళ్లకు ఆశ్చర్యంగా అనిపిస్తాయి. అలాంటి వింతలు, విశేషాలు జపాన్‌లో కాస్త ఎక్కువే. అవే ఇవి..

బికినీ జీన్స్‌

bikini-denim-pants
రోజుకో ట్రెండ్‌ మారుతుంది. పాత ట్రెండులన్నీ కొత్త ట్రెండులుగా రూపాంతరం చెందుతున్నాయి. షర్ట్‌ లోపల బనియన్‌ వేయడం పాత ట్రెండ్‌.. షర్ట్‌ పై నుంచి బనియన్‌ తొడగడం కొత్త ట్రెండ్‌. ఇలాంటి ట్రెండులు సృష్టించడంలో జపాన్‌ వాసులు పదికిలోమీటర్లు ముందుంటారు. ప్రపంచంలో ఎక్కడా లేని వింత ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ జపాన్‌లో కనిపిస్తుంటాయి. కొత్త రకం డిజైన్‌ దుస్తులు, షూలను ఇక్కడ ఎక్కువగా వాడతారు. ఆ కోవలోకే చెందుతాయి బికినీ జీన్స్‌. బికినీ, జీన్స్‌ల కలయిక ఈ బికినీ జీన్స్‌ ఫ్యాషన్‌. జపాన్‌లో వీటిని ఎక్కువగా వాడతారు.

కిట్‌క్యాట్‌.. టిక్‌టాక్‌

kitkat
ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన చాక్లెట్లలో కిట్‌క్యాట్‌ ఒకటి. జపాన్‌లో దాన్ని కీటోస్‌ కాయోస్‌ అని పిలుస్తారు. జపనీస్‌ లో దాని అర్థం.. మీరు తప్పకుండా గెలుస్తారు అని. చాక్లెట్‌ తింటే పళ్లు పుచ్చిపోతాయంటేనే రెచ్చిపోయి తింటాం. అలాంటిది తప్పకుండా గెలుస్తారు అంటే తినకుండా ఉంటారా? పరీక్షలు రాయడానికి వెళ్లే విద్యార్థులకు కిట్‌క్యాట్‌ చాక్లెట్లు ఇవ్వడం అక్కడి సంప్రదాయం. జపాన్‌లో ప్రతిరోజు 50 లక్షలమందికిపైగా కిట్‌క్యాట్‌ చాక్లెట్లు తింటారు. దీంతో ఈ దేశంలో నెస్లే కంపెనీ ప్రత్యేకంగా 300 రకాల ఫ్లేవర్లలో కిట్‌క్యాట్‌ చాక్లెట్లను విక్రయిస్తున్నది.

ఐ లవ్యూ చెప్పొచ్చు

coffe-shop
మన దేశంలో ఆడవాళ్లతో అనుచితంగా ప్రవర్తిస్తే తీసుకెళ్లి జైల్లో వేస్తారు. గుర్తు తెలియని వ్యక్తికి వెళ్లి అకస్మాత్తుగా ఐ లవ్‌ యూ చెప్తే అంతే సంగతులు. అలాంటిది ఈ దేశంలోని కాఫీ షాప్‌లలో వెయిటర్లకు ఐ లవ్యూ అని ప్రపోజ్‌ చేయొచ్చు. అక్కడి కాఫీ షాప్‌లలో అమ్మాయిలే ఎక్కువ పనిచేస్తుంటారు. వారంతా జపానీస్‌ పద్ధతిలో డ్రెస్‌ చేసుకుంటారు. కాఫీ షాప్‌లకు వెళ్లిన కస్టమర్లు ఎవరైనా సరే ఈ వెయిటర్లతో ఫొటోలు తీసుకోవచ్చు. వారికి ఐలవ్యూ కూడా చెప్పొచ్చు. అయితే, అదంతా కాఫీ షాప్‌లో ఉన్నంత సేపే. పని పూర్తయ్యాక బయటికి వస్తే ఎవరి జీవితాలు వాళ్లవి. ఎవరి ఇష్టాలు వారివి.

మెట్రో స్టేషన్లలో..

metro11
కొన్ని సందర్భాల్లో ఏం చేసినా అద్భుతం అవుతుంది. ఈ ఉద్యోగం ఒకటి సృష్టించి దీన్ని కూడా వింతగా మార్చారు. ఏ దేశంలోనైనా మెట్రో రైళ్లలో 300-500 మంది ప్రయాణిస్తుంటారు. రైల్లో తగిన చోటు ఉంటే ఇంకొంతమంది అదనంగా ఎక్కుతారు. స్థలం లేకపోతే తర్వాతి రైలు కోసం ఎదురుచూస్తారు. జపాన్‌ ప్రజలు సమయపాలనకు అత్యధిక ప్రాధాన్యమిస్తుంటారు. ఆ దేశంలో మెట్రో రైలుకు డిమాండ్‌ బాగా ఎక్కువ. అయితే, జనం తమను తాము తోసుకుంటూ రైలుకున్న ఆటోమేటిక్‌ తలుపులు మూసుకోలేనంత అధిక సంఖ్యలో ఎక్కుతుండటంతో అక్కడి ప్రభుత్వం రైల్వే స్టేషన్లలో కొత్త ఉద్యోగాలు సృష్టించింది. రైలు ఎక్కినవారిని లోపలికి తోసి, ఆటోమేటిక్‌గా తలుపులు మూసుకునేలా చేయడమే ఆ ఉద్యోగుల విధి.

1054
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles