నోటి నిండా పళ్లే!


Thu,May 23, 2019 01:21 AM

ఇప్పటి వరకు అత్యంత బరువు కలిగిన చేపల గురించి మాత్రమే విన్నాం. ఇప్పుడు ఓ అరుదైన చేప వెలుగులోకి వచ్చింది. దాని పళ్లు చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. ఈ చేప నోటి నిండా పళ్లే ఉంటాయి. ఆ చేపను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.
fish--teeth
అమెరికాలోని జార్జియాలో సెయింట్‌ సిమన్స్‌ సముద్రతీరంలో కనిపించింది ఈ వింతైన చేప. నది, చెరువుల్లో ఉండే చేపల కంటే సముద్రాల్లో ఉండే చేపలు కాస్త భిన్నంగా ఉంటాయి. ఆకృతిలో గానీ అవయవ నిర్మాణంలోగానీ ఆయా వాతావరణానికి తగినట్లుగా తమకు కావల్సిన ఆహారాన్ని సమకూర్చుకునేందుకు వీలుగా రూపొందుతాయి. ఈ చేప కూడా అదేవిధంగా నోటి నిండా పళ్లను కలిగి ఉన్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ముందు పళ్ల వరుస అచ్చం మనిషి పళ్లను పోలి చాలా పెద్దగా ఉన్నాయి. లోపలి పళ్లు మాత్రం వేటాడే క్రూరమృగాల పళ్ల మాదిరిగా ఉన్నాయి. సముద్రంలోని చేపలు, రొయ్యలు, పీతలను తినేందుకు వీలుగా పళ్ల నిర్మాణం ఉన్నదని మెరైన్‌సైన్స్‌ నిపుణులు చెబుతున్నారు. దీని పేరు ‘షీప్స్‌ హెడ్‌'. ఈ చేపలు సుమారు91 సెంటీ మీటర్ల పొడవు( 35 అంగుళాలు) ఉంటాయి. 9 కిలోల వరకూ బరువు ఉంటాయి. వీటి దంతాలు 4.5 మి.మీ నుంచి 15 మి.మీ పొడవు పెరుగుతాయి. ఇవి ఎక్కువగా గల్ఫ్‌, అట్లాంటిక్‌, అమెరికా సముద్ర తీరాల్లో చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ చేపను కనుగొన్న తర్వాత న్యూయార్క్‌లోని ఓ తీర ప్రాంతానికి ‘షీప్స్‌ హెడ్‌ బే’ అని నామకరణం చేశారు.

1508
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles