నీటితో దీపం వెలుగుతుంది!


Thu,May 23, 2019 01:21 AM

దీపం వెలిగించాలంటే నెయ్యి, కొబ్బరి నూనె, పల్లీ నూనె, నువ్వుల నూనె గానీ కచ్చితంగా ఉండాలి. ఎటువంటి నూనెతో పనిలేకుండానే ఓ ఆలయంలో దీపం వెలుగుతుంది. విశేషమేమిటంటే నిప్పుకు బద్ద శత్రువు అయిన నీటితో ఆ దీపం వెలుగడం!
temple-lamp
మధ్యప్రదేశ్‌లోని సాజాపూర్‌ జిల్లా కాలీసింద్‌ నది ఒడ్డున గడియాఘాట్‌ మాతాజీ ఆలయం ఉన్నది. ఈ ఆలయంలో ఓ అద్భుతాన్ని చూడవచ్చు. గత ఐదేండ్లుగా ఇక్కడ ఎటువంటి నూనెగానీ, నెయ్యి గానీ లేకుండా, నీటితో దీపం వెలుగుతున్నది. దేశంలో చాలా దేవాలయాలున్నా, వాటన్నింటిలో ఈ ఆలయం ఎంతో మహిమాన్వితమైందని అర్చకులు చెబుతున్నారు. ప్రమిదలో నిత్యం నూనెకు బదులు నీటిని పోస్తే జ్యోతి వెలుగుతూనే ఉంటుందని వారు అంటున్నారు. ఇంతకు ముందు నూనెతో వెలిగించేవారు. ఓ రోజు అమ్మవారు ఆలయ పూజారికి కలలో కనిపించి ఇక నుంచి దీపాన్ని నీటితో వెలిగించమని చెప్పింది. అప్పటి నుంచి ఆ పూజారి దీపాన్ని నీటితోనే వెలిగిస్తున్నాడు. ఈ గుడి నదీ తీరంలో ఉండటం వల్ల వర్షాకాలంలో పూర్తిగా మునిగిపోతుంది. అందుకే వర్షాకాలం అంతా ఆలయం మూసే ఉంటుంది. మళ్లీ గుడి తలుపులు తెరిచే వరకూ ఈ దేవాలయంలో ఉండే జ్యోతి వెలుగుతూనే ఉంటుంది.

2412
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles