భవనంలో భారీ విమానాశ్రయం!


Thu,May 23, 2019 01:20 AM

భవనంలో భారీ విమానాశ్రయమా? చదివి ఆశ్చర్యపోయారా? నిజమే. అండర్‌గ్రౌండ్‌ కార్‌ పార్కింగ్‌లాగే, విమానాలను కూడా పార్క్‌ చేసేందుకు సిద్ధమవుతున్నది ఓ భవనం. ఒకే భవనంలో అత్యంత విశాలమైన టెర్మినల్‌ రెండంతస్తుల్లో ఉండడం మరింత విశేషం.
big-airport
పెద్ద పెద్ద పట్టణాల్లో కార్‌ పార్కింగ్‌కు స్థలం లేకపోవడం వల్ల షాపింగ్‌ మాల్స్‌, హోటళ్లలో అండర్‌గ్రౌండ్‌లో పార్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. భవిష్యత్‌లో విమానాలను కూడా అదే విధంగా పార్క్‌ చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకోసమే చైనా ఏకంగా ఓ భారీ భవనంలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయనున్నది. ఈ భవనంలో డిపార్చర్‌కు రెండు అంతస్తులు, అరైవల్‌కు రెండు అంతస్తులున్నాయి. చైనా రాజధాని బీజింగ్‌లో భారీ విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. అందుకోసం 2016లోనే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇది అందుబాటులోకి వస్తే స్థలంతోపాటు, ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. నూటికి నూరు శాతం వర్షపు నీటి సేకరణ వ్యవస్థ, సౌర విద్యుత్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలు మాత్రమే ఉండేలా చూస్తున్నారు. మొత్తానికి పర్యావరణానికి మేలు చేసే విధంగా ఈ టెర్మినల్‌ నిర్మాణం జరుగుతున్నది. ఈ ఎయిర్‌పోర్ట్‌ అందుబాటులోకి వస్తే ఏటా 10 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించవచ్చని అంచనా వేస్తున్నారు. 2019 సెప్టెంబర్‌లో ఈ భారీ విమానాశ్రయం ప్రారంభం కానున్నది.

1145
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles